కన్నపేగు అర్థం మార్చేస్తున్న తల్లిదండ్రులు

అమ్మతనానికి ఏమైంది? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులకు ఏం పోయేకాలం దాపురించింది.

అమ్మతనానికి ఏమైంది? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులకు ఏం పోయేకాలం దాపురించింది. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులే శాపంగా మారుతున్నారు. మొన్నటికిమొన్న ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపేసి, తను కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

అంతకంటే ముందు, ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని ఇద్దరు పిల్లల్ని చంపేసింది ఓ మహాతల్లి. సరిగ్గా చదవడం లేదని అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల్ని బకెట్లలో ముంచి హత్య చేశాడు ఓ తండ్రి.

కన్నపేగు కలుషితం అవుతోంది. తల్లి ప్రేమ కుళ్లిపోతోంది. ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమకు మించింది లేదంటారు. “ఈ సృష్టిలో నువ్వు ద్వేషించినా, నిన్ను ప్రేమించేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది కన్న తల్లిదండ్రులు మాత్రమే” అనుకునేవాళ్లం ఇన్నాళ్లు. కానీ ఇప్పుడా రోజులు మారిపోయాయి.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే తన పిల్లల పాలిట కాలయముళ్లుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది.

అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కొడుకుల్ని వేట కొడవలితో నరికి చంపింది ఆ ఇల్లాలు. ఏడేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఆ చిన్నారుల్ని అంత కర్కశంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ తల్లికి. పిల్లలకు శ్వాసకోశ సమస్యలున్నాయంట. తనకు కంటి సమస్య ఉందంట. భర్త సహకరించడం లేదంట.

నిజంగా బిడ్డల్ని హత్య చేసేంత బలమైన కారణాలా ఇవి? కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం కావా? పెద్దలతో కలిసి డిస్కస్ చేస్తే ఇట్టే తీరిపోయే ఇలాంటి కారణాల్ని సాకుగా చూపి తన ప్రాణాలు తీసుకోవడంతో పాటు, తన ఇద్దరు కొడుకుల ప్రాణాలు తీసింది తేజశ్విని అనే తల్లి.

కేవలం ఈ ఉదంతంలోనే కాదు, దాదాపు ప్రతి ఘటనలో కారణాలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. ఏదేదో ఊహించుకొని, మనసు పాడుచేసుకొని హత్యలు చేయడం ప్రధాన కారణంగా మారిందంటున్నారు మానసిక వైద్యులు.

ప్రతిది మనసులో పెట్టుకొని అతిగా ఆలోచించడం వల్ల కలిగే విపరీత పరిమామాలుగా వీటిని చెబుతున్నారు. ముందుగా ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటపడడం ముఖ్యం. విషయాల్ని బహిర్గతంగా చర్చించడం, పెద్దల సలహా తీసుకోవడం, రోజువారీ పనుల నుంచి కాస్త విరామం తీసుకోవడం, పాజిటివ్ గా ఆలోచించడం లాంటి చిన్న చిన్న పనుల ద్వారా ఈ హింసాత్మక ప్రవృత్తి నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.

6 Replies to “కన్నపేగు అర్థం మార్చేస్తున్న తల్లిదండ్రులు”

  1. పుట్టిన పేగు అర్థం మార్చేస్తున్న కన్నA1కొడుకు

    తల్లి కి ముద్ద అన్నం పెట్టలేక, గోడకి కొట్టి ప్యాలెస్ బైటికి గేంటేసి ఏకంగా తల్లిమీదే ‘కేసు పెట్టిన A1మాడామోహన “కొడుకు

Comments are closed.