డీఎస్సీ అభ్య‌ర్థుల స‌హ‌నానికి ప‌రీక్ష‌!

కేవ‌లం వ‌య‌సు పెంపుతో సంతృప్తి ప‌ర‌చాల‌ని అనుకోవ‌డం వ్య‌ర్థ ప్ర‌య‌త్నం.

సీఎంగా చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత 16 వేల టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన ఫైల్‌పై మొద‌టి సంత‌కం చేశారు. దీంతో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఎంతో సంతోషించారు. డీఎస్సీ ప‌రీక్ష కోసం నెల‌ల త‌ర‌బ‌డి వివిధ ప్రాంతాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఇందుకు వేలాది రూపాయ‌లు ప్ర‌తి నెలా ఖ‌ర్చు అవుతోంది.

ఇదిగో, అదిగో అని డీఎస్సీపై మాట‌లే త‌ప్ప‌, ఇంత వ‌ర‌కూ చేత‌ల్లో క‌నిపించ‌డం లేదు. తాజాగా డీఎస్సీ అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితి పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ల‌కు పెంచుతూ విద్యాశాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ ఉత్త‌ర్వులిచ్చారు. ఈ వ‌య‌సును 2024, జూలై ఒక‌టి నాటికి ప‌రిగ‌ణించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

కానీ వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ఆరంభించే స‌మ‌యానికి ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్న ప్ర‌భుత్వ మాట అమ‌ల‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇంత‌కాలం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ గురించి చెబుతూ వ‌చ్చారు. ఇప్పుడు అది కూడా పూర్త‌య్యింది. ఏదో ఒక పేరుతో డీఎస్సీ నిర్వ‌హ‌ణ ఆల‌స్యానికే ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంద‌న్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించేలా, పాలనారీతి క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్య‌ర్థులు రోడ్డెక్కారు. వెంట‌నే డీఎస్సీ నిర్వ‌హించాల‌ని ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మాధానం లేదు. కేవ‌లం వ‌య‌సు పెంపుతో సంతృప్తి ప‌ర‌చాల‌ని అనుకోవ‌డం వ్య‌ర్థ ప్ర‌య‌త్నం. ఇప్ప‌టికైనా డీఎస్సీ అభ్య‌ర్థుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్ట‌డం మానేసి, ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల్సిన అవ‌స‌రం వుంది.

5 Replies to “డీఎస్సీ అభ్య‌ర్థుల స‌హ‌నానికి ప‌రీక్ష‌!”

    1. ponile nava randrala tho happy ga vunna janam – l 11 

      volunteer jobs vundaga dsc enduku – thalli chelli thu anna mee bidda

      1. volunteer jobs kooda teesi padesaruga. migilindi meelanti iTDP twitter lo tweet jobs. jeetham entha istharu enti? peekensina volunteers ki iTDP lo openings vunnaya saaru.

Comments are closed.