చిత్రం: సారంగపాణి జాతకం
రేటింగ్: 2.5/5
తారాగణం: ప్రియదర్శి, రూప కొడువాయూర్, నరేశ్, తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, శివనారాయణ, రాజా చెంబోలు, అశోక్ కుమార్, వడ్లమాని శ్రీనివాస్, కల్పలత, రూపలక్ష్మి, ఐ-డ్రీం హర్షిణి, ఐ-మ్యాక్స్ వెంకట్, సమీర భరద్వాజ్ తదితరులు
కెమెరా: పిజి విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల: 25 ఏప్రిల్ 2025
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రంతో ముందుకురావడం జరిగింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కూడా మూడేళ్ల గ్యాప్ తర్వాతే ఇలా పలకరించడం. ట్రైలర్ ఆకట్టుకుంది, కామెడీ నెరేటివ్ అని అర్ధమయింది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం.
హ్యుండాయ్ షోరూములో సేల్స్ మన్ గా పని చేసే సారంగపాణికి (ప్రియదర్శి)జాతకాల పిచ్చి. వారఫలాల దగ్గర్నుంచి, హస్త సాముద్రికం వరకూ అన్నిటినీ, అందర్నీ నమ్ముతాడు. అతని షోరూములోనే మేనేజర్ గా పని చేసే మైథిలి (రూప) అతనిని ప్రేమిస్తుంది, ప్రొపోజ్ చేస్తుంది.
ఆ క్రమంలో ఒక పామిస్ట్ (శ్రీనివాస్ అవసరాల) సారంగపాణి చేయి చూసి, త్వరలో ఒక మర్డర్ చేయాల్సి వస్తుందని షాకింగ్ విషయం చెప్తాడు. దాంతో కంగారు పడే సారంగపాణి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎన్ని తప్పటడుగులు వేస్తాడు, తృటిలో ప్రమాదాలు ఎలా తప్పించుకుంటాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటాడు అనేదే కథనమంతా! చివరికి మర్డర్ చేస్తాడా? ఎవర్ని చేస్తాడు? అనే ప్రశ్నలతో ప్రేక్షకుల్ని చివరి వరకూ కూర్చోపెట్టిన కథనమిది.
కథకి తగ్గట్టుగా టైటిల్ డిజైన్లో రాశులు చూపించడం ఔచిత్యంగా ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. చూస్తుంటేనే ఇది మోహనకృష్ణ సినిమాలాగుందే అని అనిపిస్తుంది. ముఖ్యంగా తన లైటర్ వీన్ నెరేషన్, డైలాగులు రాసుకునే విధానం, ప్రాసలు వగైరాలు..అన్నిటిమీదా తన సంతకం ఉంటుంది. కనుక తన సినిమా చూసే ముందు ప్రేక్షకులకి ఏ తరహా కథనం చూడబోతున్నారో ఒక అవగాహన ఉంటుంది. సింపుల్ లైన్, హడావిడి చేసే పాత్రలు, ఒక ట్విస్టు, కాస్తంత టెన్షన్, చివర్లో సుఖాంతం..ఇదే గ్రాఫ్ “అష్టా చెమ్మా” అయినా, ఈ “సారంగపాణి జాతకం” అయినా!
ప్రధమార్ధంలో సుమారు 22 వ నిమిషంలో ప్లాట్ పాయింట్ పరిచయమవుతుంది. అప్పటివరకు పాత్రల పరిచయాలు, ఒక పాట గట్రా సాగుతాయి. ప్రారంభంలోనే హీరోయిన్ హీరోకి తన మనసులో ప్రేమ చెప్పేస్తుంది కాబట్టి ఇది రొటీన్ లవ్ స్టోరీ కాదు.. ఇంకోటేదో ఉంది అని అనిపిస్తుంది. 22 వ నిమిషం దగ్గర ఒక హస్తసాముద్రికుడు (పామిస్ట్) హీరో చేయి చూసి తానొక మర్డర్ చేస్తాడని చెప్తాడు. ఆ పాయింట్ మీదనే తక్కిన సినిమా అంతా నడుస్తుంది. విషయం ఇంటరెస్టింగ్ గానే ఉంది. కానీ నడపడం ఆశించిన స్థాయిలో ఉందా అంటే చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్నమాట వాస్తవం. కామెడీకి- ఫార్స్ కామెడీకి, అతికి-అతిశయోక్తికి తేడా తెలిసే వాళ్లకి బాగానే ఉంటుంది. జానర్ క్లారిటీ లేకపోతే అసహజంగా ఉందేమిటా అనిపిస్తుంది.
ఇంటర్వల్ బ్యాంగ్ మరీ అద్భుతమనిపించేలా లేదు. సెకండాఫ్ ప్రారంభంలో కాసేపు డ్రాప్ అయ్యింది. తర్వాత మళ్లీ ఊపందుకుని కథ క్లైమాక్స్ కి వచ్చే సరికి రసపట్టులో పడి నవ్విస్తుంది. క్లైమాక్సులో కల్కి సీన్ స్పూఫ్ కూడా బానే ఉంది.
టెక్నికల్ విషయాలకొస్తే వివేక్ సాగర్ సంగీతం నేపథ్యానికి బాగుంది కానీ, పాటలకి కాస్త తగ్గింది. ఉన్నవి తక్కువ పాటలైనా హత్తుకోవు, హాంటింగ్ చేయవు. “చూడాలే కాని చుట్టు బోలెడంత ఫన్ను..” లాంటి పంక్తులు బాగున్నా స్వరపరిచిన తీరులోనూ, పాడించిన విధానంలోనూ ఫీల్ మిస్సయ్యింది. వింటున్నప్పుడు ఓకే కానీ, తర్వాత మైండులో రింగ్ అవ్వవు. “సారంగో సారంగ..” పాట వినడానికి బాగుంది కానీ సాహిత్యం సాదాగా ఉంది. ఇంతటి సినిమా తీసి జాతకాల మీద ఒక చక్కని సందేశంతో కూడిన వినోదాత్మక గీతం ఉండుంటే బాగుండేది. ఆ చాన్స్ మిస్ చేసుకున్నారు.
సంభాషణలు కొన్ని బాగున్నాయి, కొన్ని జంక్ లాగ ఉన్నాయి. ఉదాహరణకి “మింగ్ చావ్” సూప్ డైలాగ్ బాగుంది. దాని చుట్టూ ఇంకాసేపు ప్లే చేసినా బాగుండేది. అలాగే “భక్తి తప్ప రక్తి లేదని తీసుకొచ్చా..ముక్తి నీ చేతుల్లో ఉంది..” అని వెన్నెల కిషోర్ పబ్బులో చెప్పే డైలాగులో ప్రాస తప్ప ఆంతర్యం అందదు, అవసరం అనిపించదు. ముసలావిడ సీన్లో “నేనొక పూలమొక్కకడ నిల్చి..” పాడించడం కూడా జంక్ స్టఫ్ఫే. ఇలాంటివి మూడ్ ని అనవసరంగా డ్రాప్ చేస్తాయి. ఒక పాత్రకి “ర” పలకదు; కానీ దాంతో ఎటువంటి ప్రయోజనం లేదు; ఫన్ వర్కౌట్ అయ్యే విధంగా సంభాషణలు రాసుకోలేదు.
నటీనటుల విషయానికొస్తే, ప్రియదర్శి తన పద్ధతిలో తాను ఈజ్ తో చేసుకుపోయాడు. కొత్తగా మెరిపించిన మెరుపులేవీ లేవు; అలాగని ఎక్కడా డ్రాప్ లేదు.
హీరోయిన్ రూప ముఖ కవళికల్లో “అష్టాచెమ్మా” సెకండ్ హీరోయిన్ భార్గవి పోలికలు కనిపించాయి. బహుశా ఇంద్రగంటికి అందుకే ఈ అమ్మాయి నచ్చిందేమో. తన పాత్ర వరకు నటనపరంగా న్యాయం చేసింది.
వైవా హర్ష, వెన్నెల కిషోర్ తమ శైలిలో నవ్వించారు. శ్రీనివాస్ వడ్లమాని హడావిడి ఊహించినట్టుగానే ఉంది. డైలాగ్స్ ఇంకాస్త బలంగా పడుంటే మంచి పాత్ర అయ్యేది. కల్పలత తెలుగు సినిమాల్లో స్టాండర్డ్ తల్లిగా అలవాటైపోయింది.
నరేష్, రూపవాణి, శివన్నారాయణ నేచరల్ గా చేసుకుపోయారు. ఐడ్రీం హర్షిణి చిన్న పాత్రలో ఉనికి చాటుకుంది.
చిన్న పాత్రే అయినా, ఈ మధ్యన రీల్స్ తో పాపులర్ అయిన సింగర్ సమీర భరద్వాజ్ కూడా చాలా కాన్-ఫిడెంట్ గా నటించింది. ఈమెకు పెద్ద పాత్రలు రాస్తే మంచి కామెడీ నటిగా పేరు తెచ్చుకుంటుంది.
చివర్లో వచ్చే రాజా చెంబోలుది చిన్న పాత్ర. తనికెళ్ల భరణిది కూడా సెకండాఫులో కాసేపు కనిపించే కేరక్టర్.
పెద్దగా డైలాగ్స్ లేకపోయినా మాటిమాటికీ తలుపు తగిలి మూర్చపోయే పాత్రలో ఐమాక్స్ వెంకట్ కూడా నవ్వించాడు.
చివరిగా చెప్పేదేంటంటే, ఎక్కడా అశ్లీలం లేకుండా ఇంటిల్లపాదీ ఎంజాయ్ చేసే విధంగా ఉంది ఈ చిత్రం. అయితే ఇంతమంది సమర్ధులైన నటీనటుల్ని పెట్టుకుని ఇంకా బిగువైన డైలాగులు రాసుకుని మరింత నవ్వించగలిగి ఉంటే మంచి వినోదాత్మక చిత్రంగా నిలబడిపోయేది. ఇప్పుడైనా చూసివాళ్లని నిరాశపరచదు. ఈ కాలంలో తాంత్రిక పూజలని, వామాచారమని చెప్పుకుంటూ పాపులరైన కుహనా జ్యోతిష్యుల మాటలు వింటే ఎలాంటి అనర్ధాలు, అపార్ధాలు చోటు చేసుకుంటాయో చెప్పిన సోషల్ అవేర్నెస్ కూడా అంతర్లీనంగా ఉంది ఇందులో.
జాతకాల్ని నమ్ముకుని ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయే “ఆ ఒక్కటీ అడక్కు” రాజేంద్రప్రసాద్, జాతకాలని నమ్ముకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే “సారంగపాణి జాతకం”లోని ప్రియదర్శి తెలుగు తెర మీద గుర్తుండిపోతారు. మరీ పొట్ట చెక్కలయ్యే నవ్వులు లేవు కానీ, సరిపడా వినోదంతో కడుపు నింపింది ఈ “సారంగపాణి జాతకం”. ఈ సినిమా రాశిఫలాన్ని పంచాంగంలో మాదిరిగా రాజపూజ్యం, అవమానం లెక్కలు చెప్పాలంటే కింద బాటం లైన్ లో చూడండి.
బాటం లైన్: రాజపూజ్యం- 2.5, అవమానం-2.5
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు.
.ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు.
ఐతే థియేటర్ లో చూడాల్సిన అవసరం లేదు
ప్రియదర్శి గారి మూవీ సారంగపాణి జాతకం ఇంటిల్లపదీ నవ్వులతో ఎంజాయ్ చేసే మంచి మూవీ.
బాగుంది
Cinema chala bagundi..Recent times lo intha healthy comedy movie raledu..Enduku intha anyayam ga reviews isthunnaru..Oka vela meeku ravalsina amount raleda..Ala paid reviews iche antha pedda movie kuda kadu idi..Chinna movies ni champakandi
Arey yedava G A nijanga neeku dhamunte
Yela manchi movie cheyalo cheppara
Looks like reviewer took stop watch for viewing the movie. He wrote review with time snaps. Movie is not upto his expectations but should be good I guess
క్రిస్మస్ తాత, మీరు ఇలాగే మీ ఆవిడ ఇంట్లో వండిన కూరలకి రివ్యూ ఇవ్వండి. ఇది చికెన్ కర్రీ లాగే ఉంది కానీ కోడి సంతోషంగా చనిపోయినట్లు లేదే? ఇలాంటి రివ్యూ మీ ఆవిడకి చెప్పండి. మిగతా విషయం ఆవిడ చూసుకుంటుంది.
Why ga contact numbers adds ynduku tisukovadam ledu ninnu amma na bhuthulu tiduthunnaru post chesthunnav ma adds ki yemindi yenti problem customer care number ivvu nenu call chesi adugutha
హాయ్
హాయ్
హాయ్
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
Hi
Worst movie 0.5 is best rating
Hi
రిలాక్స్ మూవీ
Very good movie rating is 4/5…
హాయ్
తుడరుం రివ్యూ తీసేశారేమిటీ ?
రెండు రోజుల క్రితం ఉన్న తుడరుం రివ్యూ ఇప్పుడు లేదే?