అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌నాయుడిపై అదే పార్టీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాలోని వైసీపీ నాయకులకు అదృశ్య శక్తి మద్దతు ఇస్తోందని, ఇది సరైంది కాదని పరోక్షంగా సీఎం రమేశ్‌ను ఆయన హెచ్చరించడం గమనార్హం. ఇవాళ ఆదినారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మరోసారి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిమెంట్ పరిశ్రమల్లో లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకింగ్ తదితర కాంట్రాక్ట్ పనులన్నీ వైఎస్సార్‌సీపీ నాయకులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆయన చిన్నాన్న ఎంవీ రమణారెడ్డికే ఇప్పటికే కొనసాగుతున్నాయన్నారు. అవన్నీ తమకు కావాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారం నుంచి దిగిపోయినా, వాళ్లతో ములాఖత్, మిలాఖత్ అయిన సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు, పనులన్నీ వాళ్లకే చేస్తున్నాయని విరుచుకుపడ్డారు..
తనను వెంట్రుక కూడా బీజేపీ పీకలేదని వైఎస్ జగన్ అన్నారని ఆయన తెలిపారు. తిరుమల గుండు కొట్టిస్తామని ఆయన ఘాటు హెచ్చరిక చేశారు. వైఎస్ జగన్‌ను శాశ్వతంగా రాజకీయంగా లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ త్వరలోనే కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు.
ప్రజలకు మంచి చేయాలని సిమెంట్ పరిశ్రమల్ని కోరడమే తాము చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. మైన్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా తరలించడాన్ని పోలీసుల దాడిలో బయటపడితే, వాళ్లను తాను పంపానని ఆరోపించడం ఏం ధర్మమని ఆయన ప్రశ్నించారు.
ఇదే సందర్భంలో వైఎస్సార్‌సీపీ నేతలకు సీఎం రమేశ్ మద్దతు ఉందని అర్థం వచ్చే రీతిలో ఆయన పేరు ప్రస్తావించకుండానే ఆది ఫైర్ కావడం గమనార్హం. ఎక్కడో ఉన్నోడికి ఇక్కడేం పని అని ఆయన సీఎం రమేశ్‌ను పరోక్షంగా నిలదీశారు.
కడప మొత్తాన్ని ఆయనకీ రాసి ఇచ్చేయండి… అప్పుడు ప్రజలకి మంచి జరిగినట్టు..
Aadi gaadu Oka vagudu kukka..just barking..barking dogs pedda arupulu chesthayi