లోకేష్ సినిమాటిక్ యనివర్స్.. దీన్నే సింపుల్ గా ఎల్సీయు అంటారు. దీని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసే సినిమాల మధ్య చిన్న కనెక్షన్ ఉంటూ వస్తుంది. అయితే ఈసారి ఎలాంటి కనెక్షన్ అనేది ఆశ్చర్యకరం.
ఎందుకంటే, తన యూనివర్స్ లో లోకేష్ డైరక్ట్ చేయడం లేదు. భాగ్యరాజ కన్నన్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. తను కథ-స్క్రీన్ ప్లే అందిస్తూ, నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సినిమా పేరు బెంజ్.
పేరు ఎక్కడో విన్నట్టుంది కదా.. అవును.. చాలా ఏళ్లుగా లోకేష్ చుట్టూ తిరుగుతున్న టైటిలే ఇది. ఇప్పుడీ టైటిల్ తోనే కొత్త సినిమా లాంచ్ అయింది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచి మొదలైంది.
సినిమా కోసం ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ మాత్రమే కాదు, క్రేజీ నటీనటుల్ని తీసుకున్నారు. లారెన్స్ మెయిన్ లీడ్ గా నటిస్తుండగా, కీలక పాత్రల్లో మాధవన్, నివిన్ పాలీ కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు.
అంతా బాగానే ఉంది, ఈ బెంజ్ అనే సినిమాను లోకేష్, తన యూనివర్స్ లోకి ఎలా లాక్కొస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.