వల్లభనేని వంశీకి బెయిల్.. విడుదల ఎప్పుడో?

గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది.

గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. వంశీతోపాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరు చేసింది. 2023 టీడీపీ ఆఫీస్ పై దాడి ఇష్యూలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో 2025 ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు వంశీని అరెస్టు చేశారు.

ఈ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ కోసం ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో వంశీ రిమాండ్‌ను మే 21 వరకు పొడిగించగా, రిమాండ్ అనంతరం వంశీ విడుదల అయ్యే అవకాశం త‌క్కువే అని తెలుస్తోంది.

భూకబ్జాలు, అక్రమంగా మట్టి తవ్వకాలు అంటూ ఇప్ప‌టికే వంశీపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రెడ్‌బుక్‌లో మొదటి పేరు వంశీదే అని పలు టీడీపీ నాయకులు చెప్పారు. దీంతో మరిన్ని రోజులు వంశీ జైలులోనే గడపాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్ విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పినా, రోజుల వ్యవధిలోనే నాటకీయ పరిణామాల మధ్య పోలీసులను ఆశ్రయించి వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు చేశాడు. అప్పటి నుండి వంశీ జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

20 Replies to “వల్లభనేని వంశీకి బెయిల్.. విడుదల ఎప్పుడో?”

  1. ఏయ్ దొంగా.. మా అందగాడి లేటెస్ట్ ఫోటో పెట్టు..

    లేటెస్ట్ గా వల్లభనేని వంశి అందం పదింతలై జగన్ రెడ్డి ని ఉద్రేకపరిచేలా ఉంటె.. అలా దాచేస్తావేంటి..

    పబ్లిక్ గా ఈ అందగాడి అందాలు చూపిస్తే తప్పేంటి..

  2. //సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పినా, రోజుల వ్యవధిలోనే నాటకీయ పరిణామాల మధ్య పోలీసులను ఆశ్రయించి వంశి తనను కిడ్నమ్ చేసి బెదిరించాడని పిర్యాదు చేసాడు. //

    టీడీపీ కార్యాలయం పై దాడి చేసి నిప్పు పెట్టారని పిర్యాదు చేసిన సత్యవర్ధన్, కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పటం నాటకీయ పరిణామం అనిపించలేదా?

    1. బుర్ర తక్కువ వాళ్ళు అందరూ మీ పార్టీలోనే అంటారు ఎందుకు బ్రో

    1. ప్రజల తీర్పు జగన్‌కు గుణపాఠం – ఇక ఫ్రీబీల యుగం పూర్తిగా ముగిసింది

      ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి చరిత్ర సృష్టించారు. లెక్కలేనన్ని సంక్షేమ హామీలు, కోట్లాది రూపాయల పంచాయతీలు, ప్రతి ఇంటికీ ఖర్చుల వర్షం కురిపించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు కేవలం 11 సీట్లతో అడ్డంగా తోసిపారేశారు. ఇది ఓ సాధారణ ఓటమి కాదు. ఇది ప్రజల చేతి గొప్ప గుణపాఠం. ఇది ‘వెలుగు’లా మారాలని వచ్చిన ప్రభుత్వం ‘చీకటి’ పాలనగా మారితే, ప్రజలు ఎలా స్పందిస్తారో చూపించిన తర్జన.

      జగన్ మోహన్ రెడ్డి పాలన అసలు అభివృద్ధిని మరిచి, సంక్షేమం అనే ముసుగులో మోసపూరిత రాజకీయాలకే పరిమితమైంది. పేదలకు డబ్బులు వేసితే చాలు, ఓటేసే యంత్రాలుగా మారిపోతారని ఆయన భావించారు. కానీ ప్రజలు స్పష్టంగా చెప్పారు — “మీ మాయలో మేము మళ్లీ పడమని… మా ఓటుకు విలువ ఉందని…” జగన్ తలుచుకున్న ఓటు బ్యాంకు అసలే ఎగిరిపోయింది.

      ప్రజల తీర్పు చూస్తే, జగన్ మళ్లీ సీఎం అవుతాడా అన్న సందేహమే కాదు — ఇప్పుడు ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదోనే అనుమానం. కార్యకర్తలే ముసిముసిగా మాట్లాడుతున్నారు — “సార్… ఇక మెజారిటీ ఏమో గాని, కనీసం అసెంబ్లీలో మాట్లాడే స్థానం అయినా మిగిలితే బాగుంటుంది.” పార్టీ భవిష్యత్తు గురించి కార్యకర్తలే నమ్మకం కోల్పోయిన స్థితి ఇదైతే, జగన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

      పార్టీ పూర్తిగా గుంగుబాటు లోకి వెళ్లిపోయింది. జిల్లా నాయకులు కనిపించరంటే కనిపించరు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలే లేవు. అధిష్టానం ఎక్కడో దూరంగా ఉండిపోతూ, ‘మీ బాధలు మాకు పట్టవు’ అన్నట్లుగా వ్యవహరించటం ప్రజల్లో కోపం కక్కించింది.

      ఇంతలో ఇంట్లోనే గొడవలు. తల్లి విజయమ్మ, చెల్లెలు శర్మిలలను ప్రజలు గౌరవంగా చూస్తారు. కానీ జగన్ తీసుకున్న వైఖరి — కోపం రేపింది. ఆ కుటుంబం పేరు మీదే ఓట్లు తెచ్చుకున్న ఆయన, అదే కుటుంబాన్ని అవమానించడమే ప్రజలలో తీవ్ర నమ్మక లోపాన్ని తెచ్చింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు జగన్‌పై పూర్తిగా వెనుదిరిగిపోయారు.

      అంతటితో ఆగలేదు. ఇప్పుడు లిక్కర్ స్కాం పార్టీ మీద ముద్ర వేసింది. ఏ ఒక్క నేత స్పందించలేరు. ఎవ్వరూ ఖండించలేదు. జగన్ పేరు ఇందులో వస్తుందోనన్న భయం కార్యకర్తల్లో జీర్ణంగా మారిపోయింది. బెయిల్ రద్దు, అరెస్ట్ అనే మాటలు పార్టీ గోడలకే వినిపిస్తున్నాయి. పార్టీ నైతికంగా విరిగిపోయింది, శారీరకంగా తుడిచిపెట్టబడింది.

      జగన్‌కు ఇక సీఎం ఛాన్స్ లేదు – YSRCPకి చివరి ఆశ ప్రతిపక్ష హోదా మాత్రమే

      ఈ ఎన్నికలు జగన్‌కు రాజకీయంగా పూర్తి చెక్‌మేట్. ప్రజలు తలుపు మూసేశారు. తిరిగి ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, రాజకీయంగా పునరుద్ధరణ జరగడం కూడా గగనసంచారమే. ఇప్పుడు YSRCPకి మిగిలిన ఆశ – “ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా?” అనే చిన్న ఆశ. అదే కూడా ప్రసక్తిలో లేదు అన్నదే వాస్తవం.

      ప్రజలు సంక్షేమం అంటే డబ్బుల కుప్పలు కాదు — అవి ఆత్మగౌరవానికి, జీవన ప్రమాణాల మెరుగుదలకి దోహదపడాలి. కానీ జగన్ ప్రభుత్వం ఆ ఆశల్ని అవమానాలుగా మార్చింది. ప్రజల గుండెల్లో జగన్ రాజకీయం వ్యతిరేకతగా మారిపోయింది. ఆ వ్యతిరేకత ఓట్లుగా మారి, పార్టీనే చిదిమేసింది.

      ఇదే తుది తీర్పు. ఫ్రీబీ పాలకుడికి, ప్రజల చేతి గుణపాఠం.

      .

Comments are closed.