సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సమంత

హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత, ఇప్పుడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది.

హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత, ఇప్పుడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది. తను తీసిన శుభం సినిమాతో ఆమె లాభాలు అందుకోవడమే కాకుండా, తన భాగస్వాములందరూ సేఫ్ అనుకునేలా చేసింది.

శుభం సినిమాకు సంబంధించి సమంత సాధించిన తొలి విజయం నాన్-థియేట్రికల్ డీల్. తనకున్న పరిచయాలు, స్టార్ డమ్ తో ఓటీటీ, శాటిలైట్ హక్కులను మంచి రేటుకు అమ్మేసింది సమంత.

నిజానికి ఇలాంటి సినిమాలకు విడుదలకు ముందు నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం చాలా కష్టం. సీన్ లో సమంత ఉంది కాబట్టి పని ఈజీ అయింది. పైగా జీ గ్రూప్ చేస్తున్న కొన్ని కార్యక్రమాలకు ఇతోథికంగా సహాయసహకారాలు అందిస్తాననే కమిట్ మెంట్ ఇవ్వడంతో డీల్ ఇట్టే పూర్తయింది.

ఇలా రిలీజ్ కు ముందే నిర్మాతగా గట్టెక్కిన సమంత, రిలీజ్ తర్వాత మంచి రివ్యూస్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 25 లక్షల గ్రాస్ రావడంతో, సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంది. సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పలేం కానీ, పెట్టిన పెట్టుబడికి వస్తున్న రెవెన్యూతో పోల్చి చూసుకుంటే అందరూ సేఫ్.

అలా సమంత కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది. ఈ వీకెండ్ సరైన సినిమాలు లేవు. కాబట్టి శుభంకు మరో శుక్రవారం కలిసొచ్చినట్టే.