తెలుగులోకి మరో తమిళ హీరో

ధనుష్, దుల్కర్, సూర్య ఇలా ఈ జాబితా పెరుగుతూనే వుంది. ఇప్పుడు మరో పేరు చేరింది. ప్రదీప్ రంగనాధన్.

తెలుగు నిర్మాతలు అంత చురుగ్గా మిగిలిన భాషల నిర్మాతలు వుండడం లేదు. నిర్మాణాలు చకచకా తెలుగులో సాగుతున్నాయి. మంచి పారితోషికాలు అందుతున్నాయి. అందుకే ఇతర భాషల హీరోలు, దర్శకులు తెలుగులోకి వచ్చేస్తున్నారు.

ధనుష్, దుల్కర్, సూర్య ఇలా ఈ జాబితా పెరుగుతూనే వుంది. ఇప్పుడు మరో పేరు చేరింది. ప్రదీప్ రంగనాధన్. ఇటీవల తెలుగు వాళ్లకు పరిచయం అయిపోయిన తమిళ హీరో పేరు. డ్రాగన్, లవ్ టు డే సినిమాలు రెండూ తెలుగులో మంచి ఆదరణ పొందాయి. మిడ్ రేంజ్ హీరో.. లవ్, ఎంటర్ టైన్ మెంట్ జానర్ లకు పనికి వచ్చే హీరో. దాంతో తెలుగు నిర్మాతల దృష్టి అతని మీద పడింది.

ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు లాక్ అయ్యాడు. ధనుష్ తో, దుల్కర్ తో, సూర్యతో స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఖాతాలో వేసుకున్న సితార సంస్థనే ప్రదీప్ రంగనాధన్ ను కూడా తెలుగులోకి పరిచయం చేస్తోంది. మ్యాడ్ సినిమాల సిరీస్ ను అందించిన కళ్యాణ్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం మ్యాడ్ 2 రిలీజ్ హడావుడిలో వున్న కళ్యాణ్, ఓ మంచి ఎంటర్ టైన్ మెంట్ కథను ప్రదీప్ రంగనాధన్ కోసం సిద్దం చేసారు.

నిజానికి కళ్యాణ్ ఓ సినిమాను రవితేజ తో కూడా చేయాల్సి వుంది. అయితే రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత ఓ సినిమా సంక్రాంతి విడుదల టార్గెట్ చేయబోతున్నారు. అంటే జనవరి వరకు బిజీ. అందుకే ఈ లోగా కళ్యాణ్ ఓ సినిమాను ప్రదీప్ రంగనాధన్ తో చేయబోతున్నారు. ఇది కూడా ఓ నావెల్ పాయింట్ తో కూడిన ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

2 Replies to “తెలుగులోకి మరో తమిళ హీరో”

Comments are closed.