ఈ హీరోయిన్ ఏమైపోయింది?

రవితేజ సరసన నటించిన ఈగల్, రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కావ్య థాపర్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.

వరుసపెట్టి సినిమాలు చేసింది. ఒకానొక టైమ్ లో కళ్లు తెరిస్తే మీడియాలో ఆమెనే కనిపించేది. అయితే అదృష్టం కలిసిరాలేదు. కావ్య థాపర్ కెరీర్ మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతోంది.

గతేడాది ఆమె హవా నడిచింది. వరుసపెట్టి సినిమాలు చేసింది. అయితే అందులో క్లిక్ అయింది కేవలం ఒక్క సినిమా మాత్రమే. మిగిలిన 3 సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.

రవితేజ సరసన నటించిన ఈగల్, రామ్ తో చేసిన డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కావ్య థాపర్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు బోణి కొట్టలేదు ఈ ముద్దుగుమ్మ.

గతేడాది డిసెంబర్ నుంచి ఆమె వరుస విహారయాత్రల్లో ఉంది. ఖాళీ సమయాన్ని అలా సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె కజికిస్థాన్ మంచు కొండల్లో విహరిస్తోంది.

3 Replies to “ఈ హీరోయిన్ ఏమైపోయింది?”

  1. ముగ్గురు ఫ్లాప్ హీరోలు వాళ్ళ భవిష్యత్తు ఎలాగో అస్సాం అయిపోయింది, ఇప్పుడు ఈమె కెరీర్ కుర్చీని మడతపెట్టేశారన్న మాట… పాపం

Comments are closed.