చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి!

చెప్పిన టైమ్ ఒకటి, స్ట్రీమింగ్ తేదీ ఇంకోటి. ఆ సినిమాలే ఎమర్జెన్సీ, ఏజెంట్.

ప్రతి వారం ఓటీటీలోకి సినిమాలు వస్తుంటాయి. ప్రతి సినిమాను ముందుగానే ప్రకటించి స్ట్రీమింగ్ కు పెడుతుంటారు. అయితే ఈవారం మాత్రం 2 సినిమాల విషయంలో అలా జరగలేదు. చెప్పిన టైమ్ ఒకటి, స్ట్రీమింగ్ తేదీ ఇంకోటి. ఆ సినిమాలే ఎమర్జెన్సీ, ఏజెంట్.

కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన చిత్రం ఎమర్జెన్సీ. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో తొందరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని అంతా భావించారు. అంతా ఊహించినట్టుగానే మార్చి 17 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్టు కంగనా ప్రకటించింది.

కానీ ఎమర్జెన్సీ సినిమా ఆల్రెడీ ఓటీటీలో ప్రత్యక్షమైంది. చెప్పిన తేదీ కంటే 3 రోజుల ముందే ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది నెట్ ఫ్లిక్స్. మరో సినిమా ఏజెంట్ విషయంలో కూడా ఇదే జరిగింది.

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ అనిపించుకుంది. వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తుందని భావించారు. కానీ రెండేళ్లుగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమాను ఈరోజు నుంచి అందుబాటులోకి తెస్తామని సోనీ లివ్ ప్రకటించింది.

కానీ చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందే, అంటే నిన్నట్నుంచే ఏజెంట్ సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచింది సదరు సంస్థ. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమాను సరికొత్త స్క్రీన్ ప్లేతో ఓటీటీలో ప్రజెంట్ చేయబోతున్నారంటూ అప్పట్లో కథనాలొచ్చాయి. అయితే థియేటర్లలో రిలీజైన వెర్షన్ నే ఓటీటీలో ఉంచారు.

3 Replies to “చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి!”

Comments are closed.