బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ అంశం బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. కొన్నాళ్లుగా ఈ రూమర్లున్నాయి. అయితే అవన్నీ అతడితో శ్రీలీల ఒక సినిమా చేస్తూ ఉండటం వల్ల వచ్చినవే అనే అభిప్రాయాలూ లేకపోలేదు. అయితే వీటికి ఊతం ఇచ్చింది కార్తిక్ తల్లి. ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయిన ఆమెను మీడియా వాళ్లు మీ కాబోయే కోడలు ఎలా ఉండాలనే ఒక ప్రశ్నను వేయగా, ఆమె ఒక మంచి డాక్టర్ అయి ఉండాలనే సమాధానాన్ని ఇచ్చిందామె!
శ్రీలీలకు ఎంబీబీఎస్ పట్టా ఉందట.. దీంతో.. కార్తిక్ ఆర్యన్ , శ్రీలీల మధ్యన చాలా జరుగుతోందని, బహుశా వీరి పెళ్లి పీటలు ఎక్కుతారనే ప్రచారం ఊపందుకుంది. తనకు కాబోయే కోడలు మంచి డాక్టర్ అయి ఉండాలనే కార్తిక్ తల్లి మాటలను బట్టి.. వీరిది జస్ట్ డేటింగ్ కాదని, ప్రేమ అనే ప్రచారం ఊపందుకుంది.
ఇదే సమయంలో వీరి లవ్ స్టోరీ పట్ల పెదవి విరుపులూ లేకపోలేదు. అతడు డేటింగ్ చేయనిది ఎవరితో అంటూ ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ హీరోకి చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన అనుభవం ఉందట. ఆ అనుభవాల నేపథ్యంలో.. శ్రీలీలతో కూడా ఇతడు తాత్కాలికమైన బంధాన్నే కొనసాగించవచ్చని, అంతకు మించి ఈ స్టోరీ సాగకపోవచ్చనే అభిప్రాయాలకూ లోటు లేదు.
ఇక సినిమాపై జనాల్లో అటెన్షన్ రావడానికి హీరో, హీరోయిన్ల మధ్య రియల్ లైఫ్ లవ్ స్టోరీ అనే ఒక డ్రామాను నడిపించడం కూడా బాలీవుడ్ లో కూడా కొత్త కాదు! బహుశా ఈ స్టోరీ కూడా అలాంటి స్క్రిప్ట్ లో భాగం అయినా పెద్ ఆశ్చర్యం లేదు!
you said she will marry Balakrishna son at some point.
బాలీవుడ్ పైడ్ పిఆర్, మొన్న సైఫ్ గారి అబ్బాయు ఇబ్రహింతో డేటింగ్ ఇప్పుడూ ఇతను రేపు ఇంకొకడు
same rumours we heard about kovai sarala. nothing happened
Set