బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రేపు తన 60వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన షష్ఠిపూర్తి చేసుకుంటున్నారు. ఈ వయసులో ఉన్న హీరో తన సినిమాల గురించి లేదా రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడతారని అనుకుంటారు ఎవరైనా. కానీ అమీర్ మాత్రం తను డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించారు.
గౌరీ స్ప్రాట్ తో తను డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించారు అమీర్ ఖాన్. తామిద్దరం 2 దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్నామని, గడిచిన ఏడాదిగా కాస్త గట్టిగా క్లోజ్ అయ్యామని చెబుతున్నారు.
గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. అయితే ఆమెది తమిళనాడు. ఐర్లాండ్ దేశానికి చెందిన తన భర్తతో ఆమె కొన్నేళ్ల కిందట విడిపోయింది. ఆరేళ్ల కొడుకు గౌరీతోనే ఉంటున్నాడు. ఇప్పుడీమె ఏడాదిగా అమీర్ కు కనెక్ట్ అయింది.
ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో పనిచేస్తోంది. అమీర్ కుటుంబానికి కూడా దగ్గరైంది. అమీర్-గౌరి రిలేషన్ షిప్ కు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. తన పార్టనర్ గౌరీని, స్నేహితులైన షారూక్-సల్మాన్ కు కూడా పరిచయం చేశాడు అమీర్. ఈరోజు ఆ వీడియో తెగ వైరల్ అయింది.
1986లో రీనా దత్తాను పెళ్లాడారు అమీర్. 2002లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత కిరణ్ రావును పెళ్లాడారు. 16 ఏళ్లు కాపురం చేసి 2021లో ఆమెకు కూడా విడాకులిచ్చారు. ఇప్పుడు లేటు వయసులో గౌరీకి కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం గౌరీకి బాగా దగ్గరయ్యానని, 60 ఏళ్ల వయసులో ఆమెను పెళ్లి చేసుకుంటానా లేదా అనే విషయం తనకు తెలియదంటున్నారు అమీర్.
Silently imposing Love jihad.
Bad culture
Why he can’t find girls in his community
Tapu yenti