మెగాస్టార్ తో అనిల్ రావిపూడి రూపొందించే, సాహు గారపాటి నిర్మించే సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చకచకా జరుగుతోంది. తన సెంటిమెంట్ ప్రకారం విశాఖ వెళ్లి రెండు వారాలకు పైగా వుండి స్క్రిప్ట్ తొలి సగాన్ని లాక్ చేసుకుని వచ్చారు అనిల్ రావిపూడి అండ్ టీమ్. ఈ ఫస్ట్ హాఫ్ డైలాగ్ వెర్షన్ కూడా రెడీ అయిపోయింది.
ఇదే టైమ్ లో సినిమా కాస్టింగ్ విషయమై కూడా చకచకా ప్లానింగ్ చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి దింపాలి అన్నది ప్లాన్. జూన్ నుంచి డిసెంబర్ లోపు పూర్తి చేయాలి. అంటే ఏడు నెలలు. 210 రోజులు. ఈ రెండు వందల పది రోజుల్లో కనీసం 80 వరకు వర్కింగ్ డేస్ ఉండాలి.
ప్రస్తుతం రెండో సగం వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈ రెండు నెలల్లో కాస్టింగ్ పనులు కూడా పూర్తి కావాల్సి ఉంది. మెగాస్టార్ సరసన ఒకరే హీరోయిన్ ఉంటారు. అది ఎవరు అనే దాని మీద వేట సాగుతోంది. దాదాపు ఏడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదితి రావు హైదరి పేరు లిస్ట్ లో టాప్ న వున్నట్లు తెలుస్తోంది.
సినిమాను కాస్త బడ్జెట్ లోనే పూర్తి చేయాల్సి ఉంది. మామూలు సినిమా అయితే 80 రోజులు వర్కింగ్ డేస్ అయితే మహా అయితే ఇరవై కోట్లు అవుతుంది. కానీ అదే మెగాస్టార్ లాంటి హీరోతో సినిమా అంటే లోకేషన్లు, చార్టర్ ఫ్లయిట్‌లు, కాస్త ఖర్చు ఎక్కువే ఉంటుంది. సినిమా మొదలైతే టోటల్ బడ్జెట్ మీద ఓ అంచనా వస్తుంది.
Ammo chiru sir thota….tension starts
Super sir
అనిల్ కెరీర్ ఫినిష్ ఇంక.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Aa MOVIE gurinchi fans kanna meere ekkuvaga pattinchukuntunnare….
ముసలి సినిమాలు