పీపుల్స్ మీడియా పరిస్థితి ఏమిటి?

చేతిలో వున్న ప్రాజెక్టు లను పెర్ ఫెక్ట్ గా లాంచ్ చేసి, క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటే కొంత వరకు ట్రాక్ మీదకు వచ్చేయచ్చు.

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగరడం.. నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలడం.. శ్రీశ్రీ కవితలోని ఈ రెండు లైన్లు టాలీవుడ్ చాలా సంస్థలకు, వ్యక్తులకు కనెక్ట్ అవుతుంటాయి. ఇక్కడ అంతా వన్ ఫ్రైడే అని అందుకే అంటూ వుంటారు. ఏ సంస్థ ఎప్పుడు కిందకు జారుతుందో, ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందో ఎవరికీ తెలియదు. టాలీవుడ్ లోకి ఒక్కో టైమ్ లో ఒక్కో సంస్థ సర్రున దూసుకువస్తుంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ అనే సంస్థ ఇలాగే దూసుకు వచ్చింది. ఆ తరువాత మైత్రీ మూవీస్. ఆపై పీపుల్స్ మీడియా. చాలా సంస్థలు రావచ్చు. కానీ అగ్రెసివ్ గా వచ్చిన సంస్థలు ఇవి. ఒకేసారి మల్టిపుల్ సినిమాలు, పంపిణీ ఇంకా ఇంకా. ఒక విధంగా ఇది పులి మీద స్వారీ.

మైత్రీ మూవీస్ సంగతి అలా వుంచితే పీపుల్స్ మీడియా రావడానికి ముందుగానే గ్రౌండ్ ప్రీపేర్ అయి వుంది కొంత వరకు. వివేక్ కూచిభొట్ల లోకల్ ప్లేయర్ గా ఎన్నారై నిర్మాత విశ్వ ప్రసాద్ చాలా ఫాస్ట్ గా రంగంలోకి దిగారు. తనది ఫ్యాక్టరీ మోడ్ అంటూ దొరికిన ప్రతి ప్రాజెక్ట్ అందుకునే బుట్టలో వేసుకున్నారు. కానీ వాటి వల్ల వాళ్లే ఇండస్ట్రీ జనాల బుట్టలో పడ్డారు. అది వేరే సంగతి. కేవలం నిర్మాణంతో ఆగకుండా పంపిణీ, థియేటర్లు, ఔట్ డోర్ యూనిట్, స్టూడియో ఇలా కనిపించిన ప్రతి దాంట్లో పెట్టుబడులు పెట్టారు.

కానీ చేసిన ప్రాజెక్ట్ ల్లో 90 శాతం వర్కవుట్ కాలేదు. హిట్ లు తక్కువ. యావరేజ్ లు, డిజాస్టర్లు ఎక్కువ. దాంతో సంస్థ ను నష్టాలు చుట్టు ముట్టాయి. అన్నీ చక్కదిద్దుకుని, సంస్థను సరైన పట్టాల మీదకు ఎక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సంస్థ ఎన్నో ఒడి దుడుకులకు లోనవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పీపుల్స్ మీడియా చేతిలో ప్రభాస్-మారుతి ‘రాజాసాబ్’, తేజ సజ్జా ‘మిరాయి’, సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’ సినిమాలు విడుదలకు కాస్త దగ్గరగా వున్నాయి. ఇవి కాక ఇంకా మరో రెండు మూడు చిన్న ప్రాజెక్ట్ లు వున్నాయి. ఈ సినిమాలు మూడు హిట్ కొడితే పీపుల్స్ మీడియా సంస్థ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ముఖ్యంగా రాజాసాబ్ లాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే వాన పడితే టెర్రస్ మురిగి వదిలినట్లు, పీపుల్స్ మీడియా సమస్యలు అన్నీ ఎగిరిపోతాయి.

మిరాయి సినిమా మీద కూడా మంచి అంచనాలు వున్నాయి. సిద్దు జొన్నలగడ్డ తెలుసుకదా అన్న దాని మీద ఇప్పటికైతే ఏ అంచనాలు లేవు.

సినిమాల పరిస్థితి ఇలా వుండగానే పీపుల్స్ మీడియా నుంచి పేమెంట్లు సరిగ్గా వెళ్లడం లేదని, ఫండ్స్ లేక షూట్స్ క్యాన్సిల్ కొట్డడం, వాయిదా వేయడం వంటివి చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో తిరగేయడం మొదలైంది. ఇలా అయితే హీరోలు ప్రాజెక్ట్ లు ఇవ్వడానికి జంకుతారు. ఇండస్ట్రీలో క్రెడిబులిటీ ముఖ్యం. ఒకసారి అది పోతే సాధించడం చాలా కష్టం.

పీపుల్స్ మీడియా అధినేతలు ఇక్కడ అనుభవరాహిత్యం వల్లనో, ఇక్కడి వ్యవహారాల మీద అవగాహన లేకనో అగ్రెసివ్ గా వెళ్లారు. ఒకేసారి పది ప్రాజెక్ట్ లు పెట్టుకోవడం తో పాట, రకరకాల క్రాప్ట్ ల్లో కూడా దూరిపోయారు. అంతే కాదు, ఓపెన్ గా మాట్లాడిన మాటలు కావచ్చు, క్లోజ్డ్ డోర్ ల్లో మాట్లాడారంటూ వినిపించిన గ్యాసిప్ లు కావచ్చు, పీపుల్స్ మీడియా మీద ఇండస్ట్రీలో కొంత నెగిటివిటీని పెంచాయి.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేతిలో వున్న ప్రాజెక్టు లను పెర్ ఫెక్ట్ గా లాంచ్ చేసి, క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటే కొంత వరకు ట్రాక్ మీదకు వచ్చేయచ్చు. టాలీవుడ్ లో ఏ నిర్మాత చుట్టూ అయినా కొందరు వందిమాగధులు వుంటారు. భళా భళీ అనే టైపు. వీళ్లను దూరం పెట్టి, సరైన ప్రాజెక్ట్ లు టేకప్ చేయాలి. అప్పుడు పీపుల్స్ మీడియా ఓ మంచి సంస్థగా టాలీవుడ్ లో కొన్నాళ్లు వుంటుంది.

2 Replies to “పీపుల్స్ మీడియా పరిస్థితి ఏమిటి?”

Comments are closed.