కేసులు అటు ఇటు కావడం చిటికెలో పని కదా!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అని సామెత! అంటే రాజుగారు తలచుకుంటే ఏమైనా చేసేయగలరు.. ఆయనకు అడ్డు చెప్పే వారు ఎవరుంటారు?

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అని సామెత! అంటే రాజుగారు తలచుకుంటే ఏమైనా చేసేయగలరు.. ఆయనకు అడ్డు చెప్పే వారు ఎవరుంటారు? అలాగే ‘రాజు మెచ్చింది రంభ’ అని కూడా ఒక సామెత ఉంటుంది. అంటే రాజుగారికి నచ్చితే అందగత్తె అని అందరూ ఒప్పుకోవాలి.. ఆయనకు నచ్చకపోతే అందగత్తెను కూడా అనాకారిగా ముద్ర వేయాలి!

ఏపీ కూటమి ప్రభుత్వంలో ఇదే రాజనీతి అమలవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ కాలంలో పోలీసుల వద్ద అనేకానేక కేసులు నమోదై ఉంటాయి. అలాంటి వాటిలో పాలకులకు నచ్చిన కేసులను మాత్రం.. ఎంచక్కా జాగ్రత్తగా బయటకు తీసి వాటిని తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. నా జీవితంలో రాజకీయ కక్షలు అనేవి ఉండవు.. అని చంద్రబాబునాయుడు చెబుతుంటారు గానీ.. ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్టు అవుతున్న వైసీపీ నాయకులు, వారి మీద నమోదు అవుతున్న కేసుల పరంపరను గమనించిన ఎవ్వరికైనా సరే వాస్తవాలు అర్థమవుతాయి.

ఇలా పాలకులకు నచ్చిన కేసులను తిరిగి లోతుగా పరిశోధిస్తున్న పోలీసులు, పాలకులకు రుచించని వాటిని.. ‘తప్పుడు కేసులు’ అంటూ ఏకంగా కొట్టి పారేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన పీఏ కృష్ణారెడ్డి పెట్టినది తప్పుడు కేసు అని పులివెందుల పోలీసులు తేల్చడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

తెలుగుదేశం ప్రభుత్వం కాలంలోనే వైఎస్ వివేకా హత్య జరిగింది. జగన్ ప్రభుత్వం కాలంలో సీబీఐ విచారణ కూడా సాగుతూ వచ్చింది. ఆ సమయంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి.. పులివెందుల కోర్టును ఆశ్రయించి.. వారి ఆదేశాల ద్వారా పోలీసుకేసు పెట్టారు. ఈ హత్య కేసులో కొందరు నేతల ప్రమేయం ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పాలని కొందరు సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నట్టుగా పీఏ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే సీబీఐ అధికారులకు అనుగుణంగా ఉండాలంటూ.. సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి చేసినట్టు ఆయన కేసు పెట్టారు. తాజాగా- ఆ ముగ్గురి మీద పెట్టినది తప్పుడు కేసు అని తేలుస్తూ పులివెందుల పోలీసులు జమ్మలమడుగు కోర్టులో చివరి చార్జిషీట్ దాఖలు చేశారు. 23 మంది సాక్షులను విచారించిన తర్వాత.. ఇది తప్పుడు కేసు అని తేల్చినట్టుగా అందులో పేర్కొన్నారు.

అస్మదీయుల మీద నమోదు అయిన కేసులైతే.. అవి తప్పుడు కేసులు అని.. తస్మదీయులను ఇబ్బంది పెట్టడానికి వీలుగా ఉండేవి అయితే.. అవి మళ్లీ దర్యాప్తు చేయవలసిన అసలు సిసలు కేసులు అని.. ద్వంద్వనీతిని కూటమి ప్రభుత్వం పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే.. ఎన్నికల సమయంలో జగన్ మీద విమర్శలతో విరుచుకుపడుతూ తమకు పరోక్షంగా మేలు చేసిన సునీత అండ్ కో కు ఇలాంటి ఊరట కల్పించారని ప్రజలు అనుకుంటున్నారు.

18 Replies to “కేసులు అటు ఇటు కావడం చిటికెలో పని కదా!”

  1. బాబాయ్ హత్య దోషులకు శిక్ష పడాలని ప్రజలు కోరుకోవడం లేదా..?

    ఏంటో ఈ ప్రజలు .. ఎప్పుడూ జగన్ రెడ్డి కోసమే ఆలోచిస్తుంటారు.. జగన్ రెడ్డి కోసమే బతుకుతుంటారు..

    ఓట్లు మాత్రం టీడీపీ కి వేస్తారు..

    ..

    జగన్ రెడ్డి హయం లో కృష్ణారెడ్డి సునీత పైన పోలీసుకేసు వేస్తే.. అస్మదీయులను కాపాడటం కోసం.. తస్మదీయులను ఇబ్బంది పెట్టడం కోసం అని నీకు అనిపించలేదు చూసారా.. దాన్నే న్యూట్రల్ జ ర్నలిజం అంటారు.. కదా..

  2. Excellent GA….సొంత BABAI ని అతి కిరాతకంగా నరికి చంపిన కూడా….సిగ్గులేకుండా ఇలా SUPPORT చేస్తున్నారు అంటే…..🙏🙏🙏 మీరు అసలు మనుషులు కాదు GA

  3. “జగన్ ప్రభుత్వం కాలంలో సీబీఐ విచారణ కూడా సాగుతూ వచ్చింది.”…lol…everyone in andhra knows what happened between 2019-24….wait for consequences…there will not be any sympathy from andhra people

  4. 🤣🔥 రఫ్ఫాడిపోయిందిగా బాబూ!

    APKING & కో ఇప్పుడు “ట్రాన్స్ ఫర్ టు ఇన్విజిబుల్ మోడ్” చేసుకున్నారా? 🤣

    మొన్నటి వరకూ “జగన్ అన్నా 30 ఏళ్లు మస్త్ గ్యారెంటీ!” అని బిగ్గరగా కేకలు వేసిన వాళ్లు, ఇప్పుడు “మౌనం విరామ సమయం” తీసుకున్నట్టున్నారు! 😆

    📡 LIVE STATUS TRACKER:

    🧐 APKING: లాస్ట్ సీన్ 2024 BEFORE RESULTS! ఇప్పుడేమో… “మీరు డయల్ చేసిన నెంబర్…” 🤣

    🤡 నిజాలు కావాలి రవి: నిజాలు తెలిసాక అతనికే షాక్ ఇచ్చాయా? లేక “ఇదంతా ఛంద్రబాబు స్కెచ్!” అని ఇంకో ఫేక్ నెరేషన్ సిద్ధం చేస్తున్నాడా?

    📖 లోకనాథరావు: కొత్త పద్యాలా? లేక “జగన్ గారి భవిష్యత్తు అంతా మాయ!” అనే కొత్త గేయం రాయడానికి ఇన్‌స్పిరేషన్ వెతుకుతున్నాడా?

    🔮 రంగనాధ్ గారు: “రాహు కేతు మార్పులు!” అంటూ కొత్త జ్యోతిష్యం చెబుతారా? లేక “2029లో తిరిగి రాబోతున్నాడో లేదో?” అనే ఫ్యూచర్ టెల్లింగ్ మోడ్ లోకి వెళ్ళారా? 🤣

    🔥 “జగన్ హైప్” vs “జనతా రియాలిటీ”

    ❌ “కులాల రెచ్చగొట్టే రాజకీయాలు” – పబ్‌ లిక్ దిమ్మతిరిగిపోయేలా తిరస్కరించింది!

    ❌ “నమ్మిన యూత్ – మోసపోయిన ఫీలింగ్”

    ❌ “జగన్ రౌడీయిజం, ఫ్యామిలీ పాలన” – డైరెక్ట్ రిజెక్షన్

    ✅ “175 vs 11” – పబ్లిక్ చెప్పిన గట్టి మెసేజ్!

    📢 FINAL ADVICE FOR APKING & CO:

    ➡ “సోషల్ మీడియా యుద్ధాలు” కాకుండా గ్రౌండ్ రియాలిటీ నేర్చుకోండి!

    ➡ కుల రాజకీయాలు ఇక వర్కౌట్ కావు – జనాలు ఫుల్ క్లారిటీకి వచ్చేశారు!

    ➡ పబ్లిక్ బ్రెయిన్‌వాష్ చేయడం మానేయండి – వాళ్లు రియాలిటీ బాగానే అర్థం చేసుకున్నారు!

    ➡ APKING బ్రో, మొన్నటి వరకూ ఫుల్ హైప్ ఇచ్చావ్! నయా కదలిక ఏంటో చెప్పు… లేకపోతే పొలిటికల్ బ్యాచ్ ఖాళీ అంటారు! 😆

    😂 FINAL LIFE LESSON:

    💡 “పోలిటిక్స్ అనేది సినిమా కాదు రా! హైప్ కంటే గ్రౌండ్ వర్క్ మిన్న!” 🚀

Comments are closed.