యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ – నటి

యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ పాఠాలు నేర్చుకున్నట్టు వెల్లడించి అందర్నీ షాక్ కు గురిచేసింది. పైగా అదే తన తొలి స్మగ్లింగ్ అని కూడా రన్యా వెల్లడించినట్టు అధికారులు వెల్లడించారు.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14.8 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి బెంగళూరుకు స్మగ్లింగ్ చేసింది రన్యా రావు. ఆమెకు ఇంత నేర్పు ఎలా వచ్చింది? ఎంతో అనుభవం లేకపోతే తప్ప ఇన్ని కిలోలు అక్రమ రవాణా చేయడం సాధ్యం కాదంటున్నారు అధికారులు.

తాజాగా ఈ కోణంపై స్పందించింది నటి రన్యా రావు. యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ పాఠాలు నేర్చుకున్నట్టు వెల్లడించి అందర్నీ షాక్ కు గురిచేసింది. పైగా అదే తన తొలి స్మగ్లింగ్ అని కూడా రన్యా వెల్లడించినట్టు అధికారులు వెల్లడించారు.

ఆ రోజు రన్యాకు ఓ ఇంటర్నెట్ కాల్ వచ్చిందంట. దుబాయ్ అంతర్జాతీయ విమానంలోని టెర్మినల్-3 గేట్-ఏ కు వెళ్లాలని చెప్పారంట. అక్కడకు వెళ్లగా, డైనింగ్ లాంజ్ లో ఓ వ్యక్తి ఆమెకు 2 పార్శిల్స్ అందించాడంట. అందులో బంగారు కడ్డీలున్నాయని రన్యా తెలిపింది.

అయితే ఎయిర్ పోర్టులో తను బంగారం అందుకోబోతున్నాననే విషయం రన్యాకు ముందే తెలుసు. అందుకే దాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలనే అంశంపై ఆమె యూట్యూబ్ లో వెదికింది. ఓ వీడియోను ఆమె ఫాలో అయింది.

ఎయిర్ పోర్టులో కత్తెర్లు అమ్మరు కాబట్టి, విమానాశ్రయం బయటే ఆమె అతుక్కునే టేపు కొనుగోలు చేసింది. దాన్ని పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసి తన బ్యాగులో పెట్టుకుంది. విమానాశ్రయంలో పార్శిల్స్ అందుకున్న వెంటనే నేరుగా బాత్రూమ్ లోకి వెళ్లింది.

వెంట తెచ్చుకున్న అతుక్కునే టేప్స్ తో బంగారం బిస్కెట్లను తన నడుము చుట్టూ అమర్చుకుంది. అవి పైకి కనిపించని విధంగా ముందుగానే దుస్తులు ఎంపిక చేసుకొని, వాటిని ధరించింది. ఇక మిగిలిన 2-3 బంగారు బిస్కెట్లను ఆమె తన షూట్ లో దాచిపెట్టింది.

ఎప్పట్లానే బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే వీఐపీ ప్రోటోకాల్ లో భాగంగా సెక్యూరిటీ చెక్ లేకుండానే నేరుగా బయటకెళ్లే ప్రయత్నం చేసింది. సరిగ్గా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకెళ్లిన కొన్ని అడుగుల దూరంలోనే రన్యాను రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్ట్ చేశారు.

గడిచిన 6 నెలల్లో ఈ నటి 27 సార్లు దుబాయ్ వెళ్లింది. వీటిలో చివరి 4 ట్రిప్పులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే జరిగాయి. అయితే ఇదే తన తొలి స్మగ్లింగ్ అని రన్యా రావు చెబుతోంది.

3 Replies to “యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ – నటి”

  1. సొల్లు కబుర్లు. పెద్దోళ్ళని కాపాడటానికి ఈ ఎత్తులు .

    యూట్యూబ్ లో చూసాను , ఎవరో ఫోన్ చేసారు , ఎక్కడికో వెళ్లామన్నారు …

    దర్యాప్తు నుండి సీఐడీ ని తప్పించినప్పుడే అర్ధం అయిపొయింది .

  2. 26 సార్లు సక్సెస్ఫుల్ గా ఈమెని తప్పించిన వాళ్లే 27 వ సారి ఈమెని పట్టించి ఉంటారు, ఆటలో అరటి పండు అంతే

Comments are closed.