స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం!

స్పీక‌ర్ ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌డానికి వెనుకాడ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ సౌమ్యుడు. కొంత మంది స్పీక‌ర్ల‌తో పోల్చుకుంటే, గ‌డ్డం ప్ర‌సాద్ ఇత‌ర పార్టీ స‌భ్యుల‌కు మాట్లాడే అవ‌కాశం బాగా ఇస్తున్నార‌నే అభిప్రాయం వుంది. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గదీష్‌రెడ్డి మాట్లాడుతూ స‌భ మీ సొత్తేమీ కాద‌ని, అంద‌రిదీ అని స్పీక‌ర్‌ను ఉద్దేశించి సీరియ‌స్ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ స‌భ్యులు ఒక్క‌సారిగా బీఆర్ఎస్‌పై ఎదురు దాడికి దిగారు. త‌మ ద‌ళిత స్పీక‌ర్‌ను అవ‌మానించార‌ని కొంద‌రు స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ద‌ళిత జాతికి బీఆర్ఎస్ నేత‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స‌భ‌లో డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ స‌భ్యుడు హ‌రీష్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ అనేది కేవ‌లం స్పీక‌ర్‌, కాంగ్రెస్ స‌భ్యుల‌కు మాత్ర‌మే చెందిన‌ది కాద‌న్నార‌న్నారు. ఇందులో త‌ప్పేం ఉంద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌దీష్‌రెడ్డి మాట్లాడుతూ త‌న మాట‌ల్లో స‌భా సంప్ర‌దాయాల్ని ఉల్లంఘించిన‌ట్టు ఎక్క‌డుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కుంది.

ఈ నేప‌థ్యంలో స‌భ‌ను 15 నిమిషాల పాటు స్పీక‌ర్ వాయిదా వేశారు. బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ స్పీక‌ర్‌ను “మీ” అని సంబోధించ‌డం నేరం ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. స్పీక‌ర్‌ను జ‌గ‌దీష్‌రెడ్డి అవ‌మానించ‌లేద‌న్నారు. మీ అనే ప‌దం స‌భ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం కాద‌ని స్ప‌ష్టం చేశారు. స్పీక‌ర్ ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌డానికి వెనుకాడ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇది కేవ‌లం హెచ్చ‌రిక‌కే ప‌రిమిత‌మా? లేక ఆచ‌ర‌ణ‌కు నోచుకుంటుందా? అనేది తేలాల్సి వుంది.

3 Replies to “స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం!”

  1. ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి దొరకలేదు అని డ్రామాలాడిన హరీష్ రావు గాడు మామ ముక్కోడిని మార్చురీ కి పంపటానికి ఈ నాటకాలు

Comments are closed.