నెక్ట్స్ టార్గెట్ లిస్టులో వీరంతా ఉండబోతున్నారా?

మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి కూడా లోకేష్ రెడ్ బుక్ లో భాగమై, ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని పలువురు భావిస్తున్నారు.

ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో కక్ష సాధింపు అనే పదానికి అవకాశమే లేదని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. మరొకవైపు ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ మాత్రం రెడ్ బుక్ లో ఉన్న వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని… రెడ్ బుక్ లో తర్వాతి అధ్యాయాలు త్వరలోనే కార్యరూపంలో కనిపిస్తాయని సెలవిస్తుంటారు.

మొత్తానికి తండ్రీకొడుకులు ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలతో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ… తాము అనుకున్న వారినందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేసి జైళ్లకు పంపుతున్నారు. వివిధ వర్గాల నుంచి త్వరలో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అలాగే, శాసనసభలో జరుగుతున్న చర్చలను జాగ్రత్తగా గమనిస్తే… అరెస్టులకు స్కెచ్ సిద్ధమైనట్టుగా కూడా అనుమానం కలుగుతోంది. త్వరలోనే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరెస్టు అవుతారని భావిస్తున్నారు.

జగన్ హయాంలో ప్రసాద్ రెడ్డి ఏయూ వీసీగా పనిచేశారు. జగన్‌కు ఎంతో దగ్గరి వ్యక్తిగా ఉన్న ప్రసాద్ రెడ్డి, అక్కడ అనేక విమర్శలను మూటగట్టుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం, జనసేన కు చెందిన వారు ప్రసాద్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డప్పటికీ, ఆయన ఖాతరు చేయలేదు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. శాసనసభలో ప్రసాద్ రెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ తెదేపా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు మరియు జనసేన ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ డిమాండ్ చేశారు.

వారికి జవాబుగా, గతంలో జరిగిన అక్రమాలపై ఇన్‌చార్జి వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటాం అని లోకేష్ ప్రకటించారు.

నివేదిక రాకముందే కఠిన చర్యల గురించి నారా లోకేష్ చెప్పడం గమనిస్తే, విజిలెన్స్ విచారణ అనేది నామ్ కే వాస్తే అని, తాము అనుకున్నట్టుగా శిక్షించడానికి, ప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేయడానికి విజిలెన్స్ విచారణను ఒక పావులా వాడుతున్నారని ప్రజలకు అనుమానం కలుగుతోంది.

ఎమ్మెల్యే వెలగపూడి తన మాటల్లో, “కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడుస్తున్నప్పటికీ… ఇంకా ఉపేక్షించడం తగదు” అని చెప్పడం గమనిస్తే, తక్షణం శిక్షించేయాలని, తప్పొప్పులు తర్వాత విచారించుకోవచ్చునని వారంతా ఆరాటపడుతున్నట్టుగా ఉంది. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి కూడా లోకేష్ రెడ్ బుక్ లో భాగమై, ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారని పలువురు భావిస్తున్నారు.

అలాగే, మాజీ మంత్రులు కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు టార్గెట్ లిస్టులో ఉన్నారని, సమయానుకూలంగా ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపుతారని ప్రజలు అంచనా వేస్తున్నారు.

32 Replies to “నెక్ట్స్ టార్గెట్ లిస్టులో వీరంతా ఉండబోతున్నారా?”

  1. ఏమిటో ప్రజలకు అన్ని ఇప్పుడే అనుకుంటారు. ఏమిటో పలువురు ఇప్పుడే మాట్లాడుకుంటారు. అంటే గత అయిదు ఏళ్ళు ప్రజలకి అనుకునే స్వేచ్చ కూడా లేదా?

  2. తిట్టండి అన్నాను, కానీ ఈ నాయాళ్ళు కొందరు అతిగా భూతులు తిట్టారు..

    ఈ ‘నాకొడుకుల కర్మ, ఎట్లైనా చావనీ అంటూ

    “ప్యాలెస్ లైలా” మీద అనుమానం పెనుభూతమై మావోడు బెంగళూరుకి జంప్..

  3. These arrests are needed to keep having fire and unite among YCP activists…. otherwise

    These are more beneficiaries which will unite YCP activists …. Jagan to take up the next elections with a winning mode.

    YCP just lost due to their activists have not worked for winning

  4. “జగన్‌కు ఎంతో దగ్గరి వ్యక్తిగా ఉన్న ప్రసాద్ రెడ్డి, అక్కడ అనేక విమర్శలను మూటగట్టుకున్నారు.”..thats means this fellow was a disgusting che ddi character…you can guess what he did at university…converted into che ddi sanctuary

  5. పాపం చెక్కర ఎక్కువై కింద కారుతున్నట్లు ఉంది నెక్స్ట్ ఎవరో తెలియక…ఒకరోజు గోరంట్ల మాధవ్ అన్నావ్, ఇంకోరోజు రజినీ అన్నావ్, ఇప్పుడు విల్లు

  6. సూ(ప)ర్ సి!క్స్ ఎలాగూ బొ!క్కనే….

    సూ(ప)ర్ గా సి!క్స్ మందిని బొ!క్కలో వేస్తే ..ఇప్పటికి మ!జా తీరుతుంది.

    చెంబు, చెంచా మ!జా తీర్చడానికి ప్రజలు కూడా చూస్తున్నారు.

    ప్రజలు ఎలాంటి అగచాట్లు పడితే మాకెందుకు.

  7. My wife doesn’t follow politics, but every time I watch news of Vamsi and Posani’s arrest, she asks when Gutka Naani will be put behind bars. Hope it will be realistic soon.

Comments are closed.