పెళ్లికాని సప్తగిరి అగచాట్లు

సినిమా ఎంటర్ టైన్ మెంట్ వే లో వుంటుందని వేరేగా చెప్పక్కరలేదు. కానీ ఆ వినోదం ఏ మేరకు పండింది. నవ్వు తెప్పించింది అన్న పాయింట్ మీద సినిమా విజయం బేస్ అయి వుంటుంది.

పెళ్లికాని సప్తగిరి అగచాట్లు

పెళ్లి చేసి చూడు అన్నది ఎప్పటికీ వాలిడ్ పాయింట్. అయితే ఒకప్పుడు అమ్మాయి పెళ్లి..ఇప్పుడు అబ్బాయి పెళ్లి. కట్నాల కోసం ఎదురు చూస్తూ వుంటే తలపై జుట్టు తరిగిపోవడం, ఏజ్ పెరిగిపోవడం తప్పిస్తే ఒరిగేది ఏమీ వుండదు. అదీ కాక అమ్మాయిల డిమాండ్లు పెరిగాయి. వాటిని మీట్ అయ్యే అబ్బాయిలు తగ్గారు. అందుకే పెళ్లికాని ప్రసాద్ లు పెరిగారు.

ఈ పాయింట్ ను తీసుకుని కమెడియన్ కమ్ హీరో సప్తగిరి చేస్తున్న సినిమా పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. మలేషియాలో వుండే కుర్రాడు. పల్లెటూరిలో వుండే తండ్రి. కొడుకుకు కట్నం తీసుకుని, రూల్స్ అన్నీ పాటించి పెళ్లి చేయాలని తండ్రి, ఏజ్ బార్ అవుతోంది. ఎక్స్ పీరియన్స్ తో పాటు ఎక్సపయిరీ డేట్ దగ్గరకు వస్తోందని కొడుకు ఆందోళన.

ఆఖరికి కనిపించింది అమ్మాయి అయితే చాలు పెళ్లి చేసేసుకోవాలన్న తపన. ఇలాంటి టైమ్ లో పరిచయం అయిన అమ్మాయి. దానికి అడ్డం పడిన తరతరాల సెంటిమెంట్. ఇదీ కథ అని ట్రయిలర్ లో క్లారిటీగా చెప్పేసారు. సినిమా ఎంటర్ టైన్ మెంట్ వే లో వుంటుందని వేరేగా చెప్పక్కరలేదు. కానీ ఆ వినోదం ఏ మేరకు పండింది. నవ్వు తెప్పించింది అన్న పాయింట్ మీద సినిమా విజయం బేస్ అయి వుంటుంది. సప్తగిరి మంచి కమెడియన్. అతనిలో లోపం ఎప్పుడూ వుండదు. కంటెంట్ లో లోపం తప్ప. ఈసారి మాత్రం పూల్ ఫ్రూఫ్ కంటెంట్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి, ఈ పెళ్లి కాని ప్రసాద్ ఎలా వుంటాడో?

One Reply to “పెళ్లికాని సప్తగిరి అగచాట్లు”

Comments are closed.