వెండితెరపై సూపర్ హిట్టయిన సినిమా, బుల్లితెరపై ఆడిన సందర్భాలు ఈమధ్య కాలంలో లేవు. లక్కీ భాస్కర్, హనుమాన్ లాంటి సినిమాలు వీటికి అతీతంగా నిలిచినప్పటికీ కళ్లుచెదిరే రేటింగ్స్ రాలేదు వీటికి.
ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే, రెండేళ్ల కిందటొట్టిన బలగం (14.3 టీఆర్పీ) తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటింగ్ తెచ్చుకున్న సినిమా లేదు. ఇన్నాళ్లకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చింది. నెగెటివ్ సెంటిమెంట్ ను తిప్పికొట్టింది.
వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏకంగా 18.1 టీఆర్పీ వచ్చింది. బలగం తర్వాత, ఆ సినిమాను మించి రేటింగ్ తెచ్చుకున్న సినిమా ఇదే. ఈ రెండూ దిల్ రాజు సినిమాలే కావడం విశేషం.
సలార్, కల్కి, ధమాకా, వాల్తేరు వీరయ్య, విరూపాక్ష.. ఇలా ఈ 2-3 ఏళ్లలో చాలా హిట్ సినిమాలొచ్చాయి. కానీ వేటికీ స్మాల్ స్క్రీన్ లో చెప్పుకోదగ్గ రేటింగ్స్ రాలేదు. కల్కి, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలైతే టీవీల్లో ఫ్లాప్ అనిపించుకున్నాయి.
ఇలాంటి టైమ్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి టీఆర్పీ సాధించింది. టీవీ ప్రసారంతో పాటు, ఓటీటీలోకి ఒకేసారి తీసుకురావడం వల్ల ఈ సినిమాకు మంచి రేటింగ్ వచ్చిందనే అంచనాలున్నాయి.
ప్రస్తుతం టీఆర్పీల్లో అల వైకుంఠపురములో (29.4) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సరిలేరు నీకెవ్వరు సినిమా (23.4) రెండో స్థానంలో ఉంది. ఇప్పటికీ ఈ సినిమాలకు టీవీల్లో రేటింగ్స్ వస్తుండడం విశేషం.
Movie comedy valla hit aindhi
TRP వలన మనకి ఏమీ ఉపయోగం. వస్తే గీస్తే టీవీ ఛానల్ కి డబ్బులు వస్తాయేమో. ఏమీ రా బాలయోగి ఎమిరా నే వలన దేశానికి ఉపయోగము