వైఎస్ జగన్ కోటరీలో విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారన్నది పచ్చి నిజం. కారణాలేవైనా వైసీపీతో పాటు ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని విడిచిపెట్టారు. రాజకీయాల నుంచి తప్పుకుని, వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి మొదట చెప్పారు. నిజమే అనుకున్నారంతా. కానీ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ… తాను జగన్ కోటరీ వల్ల బయటికి రావాల్సి వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. ఆ కోటరీ నుంచి బయటపడితే తప్ప, వైసీపీకి భవిష్యత్ వుండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్ మనసులో తనకు స్థానంలో లేదని అర్థమయ్యాక, మనసు విరిగిపోయిందని ఆయన అనడం సంచలనం కలిగించింది.
జగన్‌ను నేరుగా ఆయన విమర్శించలేదు. జగన్ కోటరీని ఆయన టార్గెట్ చేశారు. దీంతో జగన్ కోటరీపై తీవ్ర చర్చ జరుగుతోంది. జగన్ కోటరీలో ఎవరెవరున్నారు? వాళ్లు ఏం చేస్తున్నారు? తదితర ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ కోటీరిపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి కూడా…. విమర్శలపాలువుతున్నారు. ఎందుకంటే, నిన్నమొన్నటి వరకు ఆ కోటరీలో విజయసాయిరెడ్డి కూడా భాగస్వామే కాబట్టి.
అయితే విజయసాయిరెడ్డిని వైసీపీ నేతలు పట్టించుకోకుండా వుండాల్సింది. ఎందుకంటే, విజయసాయిరెడ్డి నేరుగా జగన్‌ను విమర్శించలేదు. కోటరీతో జగన్‌కు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటే మంచిగా మార్పు చేసుకోవచ్చు. అబ్బే, వైసీపీకి మంచి రోజులు వస్తే ఎలా? వైసీపీ బాగు కోరుకునే వాళ్లైతే, ప్రతిదానికీ కోటరీ తెరపైకి ఎందుకొస్తుంది? నిజంగా జగన్ రాజకీయ శ్రేయస్సు కోరుకునే వాళ్లైతే, తెరవెనుక వుంటూ మంచి పనులు చేసేవాళ్లు.
కోటరీపై విజయసాయిరెడ్డి విమర్శలు చేయగానే, వైసీపీ నేతల్ని ఆయనపై ఉసిగొల్పారు. తమపై విమర్శల్ని కూడా, జగన్‌పై చేసినట్టుగా క్రియేట్ చేసి, కోటరీ నేతలు పార్టీ ముఖ్య నాయకుల్ని మీడియా ముందుకు ఎగతోలారు. తద్వారా కోటరీనే బలమైందని నిరూపించుకున్నట్టైంది. జగన్‌ను నేరుగా విజయసాయిరెడ్డి తిట్టాలని కోటరీ కోరుకుంటోంది. అందుకే విజయసాయిరెడ్డిని కోటరీ రెచ్చగొడుతోంది.
జగన్ కోటరీలో భాగస్వామి అయిన విజయసాయిరెడ్డి గొప్ప సంస్కారి అని ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే ఆయన కూడా ఆ తాను ముక్కే కదా! జగన్ కేంద్రంగా కోటరీ, దాన్ని విభేదించే వెళ్లే వైసీపీ నాయకులు తమకిష్టం వచ్చినట్టు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. దీన్ని గ్రహించలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. జగన్ అజ్ఞానమే కోటరీ బలం. రోజురోజుకూ జగన్‌ను చీకట్లోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ మేల్కొని, తనను తాను రక్షించుకుంటే తప్ప, ఆయన్ను దేవుడు కూడా కాపాడలేరు. జగన్ అంతగా కోటరీ ఊబిలో కూరుకుపోయారు.
కొటరీ లెదు బొక్కా లెదు! అన్న చెప్పింది చెయడానికె కొటరి. అన్నకి చెప్పటనికి కాదు!
అన్నయ్య is the the most incapable & incompetent. అతని విజయం వెనుక తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి, సోనియానే ఎదురించిన మొనగాడు అని ఇచ్చిన ఫేక్ ఎలివేషన్, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై చెప్పిన లెక్కలేనన్ని అభద్దాలు, బాబాయ్ హత్య, బీజేపీతో తలుపు చాటు చీకటి వ్యవహారాలు, యువకుడు కాబట్టి ఏదో కొత్త ఆలోచనలతో రాష్ట్రాన్ని నిడిపిస్తాడు అని ఆశించి ప్రజలు గెలిపించారు. కానీ తన పాలనతో ప్రజల నమ్మకాన్ని దారుణంగా దెబ్బతిసాడు. పాలన తెలియదు, రాజకీయం తెలియదు, డిస్ప్లొమసీ తెలియదు అసలు ఏమీ తెలియదు ఒక్క సంపాదన, కక్ష రాజకీయాలు తప్పితే. పక్కన వుండే అక్కాయి బుక్కాయి గాళ్ళు చెప్పినట్లు ప్రభుత్వాన్ని నడిపాడు
super and correct comment
Excellent Sir
Good analysis
Overall ga nuvvu cheppedi entante maavayya vengalappa antav..anthega
పరిపాలన చేతగాని వ్యక్తి కి అధికారం ఇస్తే.. ఇలానే ఊబిలో కూరుకుపోతాడు..
ఈ ప్రపంచం లో అధికారం లో ఉన్న ఏ సీఎం అయినా, పీఎం అయినా, అధ్యక్షుడైనా తమ చుట్టూ కోటరీ ఉంచుకోవడం సర్వసాధారణం..
కానీ వాళ్ళెవరూ.. ఇలా కోటరీ ఊబిలో కూరుకుపోలేదు కదా.. పైగా.. తమ చేతగానితనాన్ని ఆ కోటరీ పైన తోసేసి చేతులు దులుపుకోలేదు కదా..
..
మనం చెప్పిన పనులు చేసి పెట్టే .. నమ్మకస్తులనే .. కోటరీ అంటారు..
మన రాష్ట్రం లో చంద్రబాబు కి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి కూడా కోటరీ ఉంది..
వాళ్లంతా.. వాళ్ళ బాస్ చెప్పిన మాటని తూ చా తప్పకుండా పాటిస్తారు.. తమ ఆలోచనలను బాస్ ఆలోచనలకు అనుకూలంగా మార్చుకుని నడుచుకొంటారు..నడిపిస్తారు..
అల్టిమేట్ గా.. బాస్ మాటే ఫైనల్..
..
కానీ జగన్ రెడ్డి మాత్రం.. పేరుకు సింగల్ సింహం.. చేతలు శూన్యం..
తమ కింద పనిచేసే వాళ్ళ స్కెచ్ లో పడిపోయి.. కూరుకుపోయే వాడు.. నాయకుడు ఎలా అవుతాడు..
ఇవన్నీ చూస్తుంటే.. వీడికి 151 ఎలా వచ్చాయో అనే అనుమానం కన్నా.. అసలు 11 అయినా ఎలా వచ్చాయి అనే ఆలోచనే ఎక్కువగా కలుగుతోంది..
Well said
“పెళ్ళాం n “సజ్జల్ ఊబిలో జెగ్గుల్”!
“భావ ఊబిలో పెళ్ళాం”
మిగతా కోటరీ అంతా పేకమేడ.. ఎప్పుడైనా ఎవరైనా కూలిపోవచ్చు (A2) కొత్తగా వస్తూ ఉండొచ్చు (చెవి)
సిద్ధమా?? Why Not 175 అంటూ అహంకారం తో విర్రవీగిన తన “పెళ్ళాన్ని నేలమీద పండబెట్టిన” powerful “ఘరానా మొగుడు ” కి పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు.
పబ్లిక్ చెప్పిన “11కి 175” లెసన్ ని అందరూ గుర్తుంచుకోవాలి!
పబ్లిక్ “నిజమైన నాయకుడు” కావాలి, “ఫేక్ గాడ్” కాదు!