Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్‌ డైరెక్టర్‌ రేంజ్‌ పడిపోయింది!

పవన్‌ డైరెక్టర్‌ రేంజ్‌ పడిపోయింది!

పవన్‌కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్‌ చేసిన తర్వాత స్టార్‌ హీరోలందరి దృష్టిని హరీష్‌ శంకర్‌ ఆకర్షించాడు. ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా డైరెక్ట్‌ చేసాడు. ఆ చిత్రం మిస్‌ఫైర్‌ అవడంతో హరీష్‌ ఇబ్బందుల్లో పడ్డాడు. అంతకుముందు ఉన్న ప్రపోజల్స్‌ అన్నీ కాన్సిల్‌ అయిపోయాయి. స్టార్‌ హీరోల నుంచి అతనికి పిలుపులు లేకుండా పోయాయి. 

ఏడాదికి పైగా వేచి చూసిన తర్వాత ఇప్పుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో సినిమా చేస్తున్నాడు. తన తదుపరి చిత్రం కూడా యువ హీరోతోనే చేస్తాడనే టాక్‌ వినిపిస్తోంది. నిఖిల్‌తో హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని లేటెస్ట్‌ న్యూస్‌. 

రవితేజ, పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌తో సినిమాలు తీసిన దర్శకుడు ఇప్పుడు సడన్‌గా యువ హీరోలతో చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఒక్కసారి స్టార్‌ హీరోలని డైరెక్ట్‌ చేసిన తర్వాత సదరు దర్శకులంతా ఇక ఆ రేంజ్‌ హీరోలతోనే సినిమాలు చేసారు, చేస్తున్నారు. హరీష్‌ శంకర్‌కి మాత్రం కథ మొదటికి వచ్చేసింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?