Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ సరసన కొత్త అమ్మాయి

ప్రభాస్ సరసన కొత్త అమ్మాయి

ప్రభాస్ సాహో సినిమా కోసం హీరోయిన్ల వేట ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముంబాయికి చెందిన అనేక మందిని చూసి చూసి, ఆఖరికి ఓ కొత్త అమ్మాయిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అది మెయిన్ హీరోయిన్ గానా, లేక ఇద్దరు హీరోయిన్లు వుంటే వారిలో ఒకరిగానా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రస్తుతానికి ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసిన మాట అయితే పక్కా. అనేక మందిని చూసి ఫైనల్ లిస్ట్ లోకి వచ్చిన ఆ అమ్మాయితో డిస్కషన్లు జరుగుతున్నాయి. అగ్రిమెంట్ కావాల్సి వుంది. 

సాహో సినిమా షూట్ ఫ్రారంభమై, మెల్లగా సాగుతున్నా, అసలు స్పీడ్ ఇంకా అందుకోవాల్సి వుంది. అలా జరగాలంటే హీరోయిన్ రెడీ కావాలి. వన్ వీక్ లో ఈ ప్రాసెస్ ఫైనల్ అవుతుందని వినికిడి. సాహో సినిమా పూర్తయిన తరువాత రాధాకృష్ణ డైరక్షన్ లో కూడా ఓ సినిమా చేయాల్సి వుంది ప్రభాస్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?