Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్టార్ మా పై ఎన్టీఆర్ అసంతృప్తి?

స్టార్ మా పై ఎన్టీఆర్ అసంతృప్తి?

మా టీవీని స్టార్ టీవీ కొనేయగానే స్టార్ స్టాటస్ రాలేదు. బిగ్ బాస్ షో హిట్ కావడంతో ఆ స్టేటస్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ స్టాటస్ మళ్లీ మెల్గగా జారుతోంది. బిగ్ బాస్ షో రేటింగ్ కరుగుతోంది. ఇదే విషయమై హీరో ఎన్టీఆర్ మా టీవీ మీద తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది.

స్టార్ మా లోకల్ హెడ్ ఆలోచనా విధానంతోనే బిగ్ బాస్ షో రేటింగ్ లు నిలువునా నీరుకారుతున్నాయన్న ఒపినీయన్ తో ఎన్టీఆర్ వున్నట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ టైమ్ లో ప్రారంభయ్యే బిగ్ బాస్ సీజన్ 2 అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ఇంతకీ కథేంటీ అంటే, స్టార్ మా లోకల్ హెడ్ గా వున్న వ్యక్తి మీడియా బ్యాక్ గ్రవుండ్ నుంచి వచ్చిన వారు కాదు. హైలీ ఎడ్యుకేటెడ్, టాలెండెడ్ నే కానీ, ఆయన లెక్కలన్నీ రెవెన్యూ చుట్టూ తిరుగుతాయని వినికిడి. ఎంత మంది చూసారు, ఎంత పేరు వచ్చిందన్న దానికన్నా ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలిగాం అన్నది అతని ఆలోచగా తెలుస్తోంది.

అందుకే ఎవరు ఎంత చెప్పినా వినకుండా, గంట కార్యక్రమాన్ని గంటన్నర చేసి, దాన్ని అప్పటికప్పుడే రిపీట్ పెట్టి, మర్నాడు కూడా మళ్లీ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ చేయించే పని పెట్టుకున్నారట. దీని వల్ల సగటు రేటింగ్ లు దారుణంగా పడిపోయాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ స్వయంగా చెప్పినా సదరు సిఇఓ వినలేదని తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

రెండో సీజన్ అగ్రిమెంట్ కు వచ్చినపుడు కచ్చితంగా తన వైపు నుంచి కొన్ని నిబంధనలు పెట్టి కానీ సైన్ చేయకూడదని తారక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహా అయితే చిన్న తెరమీదకు వచ్చి ఓ మాంచి షో చేసి, పేరు తెచ్చుకుని తప్పుకున్నట్లు అవుతుంది. లేదూ అంటే మరోసారి మంచి షో చేయడానికి పక్కాగా రంగంలోకి దిగినట్లు అవుతుంది అని, ఆ మేరకు తారక్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే రాయలసీమ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ల విషయంలో కూడా స్టార్ మా సిఇఒ సంప్రదాయ పద్దతులకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు, దాంతో సీమలోని చాలా ప్రాంతాల్లో స్టార్ మా ప్రసారాలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. ఇన్ని జరుగుతున్నా, స్టార్ మా యాజమాన్యం కావాలని ఆ సిఇఓను రిక్రూట్ చేసుకున్నందున, ఆయనను మార్చే అవకాశాలు లేవు. అందువల్ల ఎన్టీఆర్ కు స్టార్ మా కు రెండో సీజన్ విషయంలో కుదిరే అగ్రిమెంట్ కాస్త ఆసక్తికరంగానే వుండే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?