Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్-దేవిశ్రీ: కలిస్తే ఎంత లాభం?

త్రివిక్రమ్-దేవిశ్రీ: కలిస్తే ఎంత లాభం?

ఇండస్ట్రీలో వ్యక్తులు కలవడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ల మనసులు కలిస్తేనే మంచి అవుట్ పుట్ వస్తుంది. ఒకసారి విడిపోయిన తర్వాత తిరిగి కలిస్తే క్రేజ్ తప్ప, చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉండదు. టెక్నికల్ గా కావొచ్చు, లేదా ఆన్-స్క్రీన్ పరంగా కావొచ్చు.. గతంలో ఎన్నో జంటలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈ నేపథ్యంలో మళ్లీ కలిసే ఛాన్స్ ఉన్న దేవిశ్రీప్రసాద్, త్రివిక్రమ్.. గత వైభవాన్ని రిపీట్ చేయగలరా అనేది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న.

త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ అనుబంధం ఇప్పటిది కాదు. సరిగ్గా పదేళ్ల కిందట వీళ్లిద్దరి ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్నుంచి రెగ్యులర్ గా దేవిశ్రీకే అవకాశాలిస్తూ వచ్చాడు త్రివిక్రమ్. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి.. ఇలా వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయింది.

కానీ సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. దేవిశ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అ..ఆ సినిమాకు చాలా ఇబ్బందిపడ్డాడు త్రివిక్రమ్. ఎంతోమంది సంగీత దర్శకుల్ని అనుకొని ఫైనల్ గా కాస్త కాంప్రమైజ్ అయి మిక్కీ జే మేయర్ తో పనిచేయాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా పవన్ అజ్ఞాతవాసి సినిమాకు కావాలనే అనిరుధ్ ను తెరపైకి తీసుకొచ్చాడు.

ఈ సినిమాకు సంబంధించి పవన్ తర్వాత అనిరుధ్ మాత్రమే భారీగా ఎలివేట్ అయ్యాడంటే... త్రివిక్రమ్ ప్లానింగ్ అర్థంచేసుకోవచ్చు. టాలీవుడ్ లో దేవిశ్రీప్రసాద్ కు ప్రత్యామ్నాయంగా అనిరుధ్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు ఎంత చేయాలో అంత చేశాడు త్రివిక్రమ్. 

అయితే అజ్ఞాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రమ్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. నెక్ట్స్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా కోసం తప్పనిసరిగా మార్పుచేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కనుక గట్టిగా పట్టుబడితే అనిరుధ్ స్థానంలో దేవిశ్రీతో కలిసి వర్క్ చేయాల్సి రావొచ్చు. అదే కనుక జరిగితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చినంత బెస్ట్ అవుట్ పుట్ వస్తుందా అనేది అనుమానం.

గతంలోలా దేవిశ్రీకి చెప్పి త్రివిక్రమ్ పనిచేయించుకోగలడా..? ఒకవేళ త్రివిక్రమ్ చెప్పడానికి ప్రయత్నిస్తే దేవిశ్రీ ఆ మాట వింటాడా..? ఇగోలు పక్కనపెట్టి ఇద్దరూ కలిసి పనిచేయగలరా..? ఇప్పుడీ మొత్తం వ్యవహారం ఎన్టీఆర్ చేతిలో ఉంది. వీళ్లిద్దర్నీ ఎన్టీఆర్ మానసికంగా ఎంత దగ్గర చేస్తాడనే విషయంపైనే కొత్త సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?