Advertisement

Advertisement


Home > Movies -

ఈవారం ట్రేడ్‌ టాక్‌

ఈవారం ట్రేడ్‌ టాక్‌

బాక్సాఫీస్‌ బాహుబలి మయం అయిపోయి రెండు వారాలైంది. రెండు వారాల నుంచి ఇండియన్‌ సినిమా మీడియాలో బాహుబలి వార్తలు తప్ప మరేమీ లేవు. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోను బాహుబలి అద్భుతాలు చేస్తోంది. తెలుగు సినిమా రికార్డులన్నీ తుడిచేసిన ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా ఖాన్స్‌ ఆధిపత్యానికి తెర వేసింది.

ఇండియాలోనే నాలుగు వందల కోట్ల నెట్‌ గ్రాస్‌ వసూలు చేసి ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లతో ఇండియన్‌ సినిమా చరిత్రలో అతి పెద్ద కమర్షియల్‌ విజయంగా నిలిచింది. 

బాహుబలి భయపెడుతున్నప్పటికీ ఈవారం రెండు చిన్న సినిమాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. శర్వానంద్‌ రాధ, రాహుల్‌ నటించిన వెంకటాపురం శుక్రవారం రిలీజ్‌ అయ్యాయి. కొత్త సినిమాల వల్ల బాహుబలి ఉధృతి తగ్గుతుందని అనుకోవడానికి లేదు. ఈ జోరు మరో రెండు వారాలైనా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?