బ్రహ్మానందం..చిరకాలంగా..ఎన్నోహిట్లు..బోలెడు క్రేజ్..స్క్రీన్ మీద కనపడగానే ఈలలు గోలలు..రోజుకు అయిదులక్షల రెమ్యూనిరేషన్..ఇంకా..ఇంకా…ఇప్పుడు అవన్నీ ఫేడవుట్ అవుతున్నాయి. వరుసగా బ్రహ్మీ నటించిన పాత్రలు అలరించడం లేదు..పైగా అల్లరిపాలవుతున్నాయి. ఎందుకిలా?
దానికి బ్రహ్మీ తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడట. పాత్రలు విజయం సాధించాలంటే, డైరక్టర్లు మంచిగా క్రియేట్ చేయాలి. రచయితలు మాంచి డైలాగులు రాయాలి..అప్పుడు నేను వాటిని ప్రేక్షకులకు చేరువ చేస్తాను కానీ, నేనొక్కడనే బాధ్యుడా అని అంటున్నాడట.
మరి ఇన్నాళ్లూ, ఎవరి క్రెడిట్ ను బ్రహ్మీ స్వంతం చేసుకుని, రోజులు లెక్కన, గంటలలెక్కన పారితోషికం భారీగా వసూలు చేసారు. ఇంకా అనేక సదుపాయాలు కూడా డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని కూడా గ్యాసిప్ లు వున్నాయి.
ఇవి కాక, చాలా మందిని ఎదగనివ్వలేదని కూడా ఆరోపణలు వున్నాయి. ఇప్పుడు టైమ్ రివర్స్ అయింది. పదుల సంఖ్యలో కుర్ర కమెడియన్లు పుట్టుకువచ్చారు. దాంతో ఇప్పుడు ఎవరూ, ఎవర్నీ ఆపే పరిస్థితి లేదు. వాళ్ల ముందు బ్రహ్మీ కామెడీ ఆనడం లేదు.
అందుకే..ఇప్పుడు మాట మార్చి..గెలిస్తే నా ఘనత, ఓడితే అంపైర్ తప్పు అన్నట్లు మాట్లాడుతున్నాడట బ్రహ్మీ.