ఆర్జీవీ అన్నా, ఆయన ప్రాజెక్టులు అన్నా జనాలకు జస్ట్..పాస్ ఆన్ కబుర్లుగా తయారయ్యాయి. ఎవరూ పెద్దగా సీరియస్ గా అనుకోవడం ఏనాడో మానేసారు. బ్రూస్ లీ సినిమా ముందు తన బ్రూస్ లీ అంటూ హడావుడి చేసారు..ఇప్పుడేమయిందో తెలియదు.ఇప్పుడు మూకీ సినిమా అంటూ హడావుడి మొదలయింది. రాజ్ తరుణ్ తో.
అయితే ఈ సినిమా విషయంలో కూడా ఓ కొత్త ఐడియాతో వున్నాడట వర్మ. ముందుగా కాస్త లెంగ్త్ ట్రయిల్ షూట్ చేస్తాడట. అది చూసి, నటులందరూ తను అనుకున్నమేరకు నటించారా లేదా? ఫుటేజ్ బాగానే వచ్చిందా లేదా? సినిమా మూకీ అయినా అర్థం అయ్యేలా వుందా లేదా?అన్నది చూసి, అప్పుడు ముందుకు వెళ్లాలో లేదో డిసైడ్ అవుతాడట.
అంతా బాగానే వుంది. రాజ్ తరుణ్ అంటే అప్ కమింగ్ హీరో. కానీ ఆర్జీవీ ఈ సినిమా కోసం కాస్త గట్టి నటులనే తీసుకోవాలి అనుకుంటున్నాడటం. వాళ్లంతా ఈ రిహార్సల్ వ్యవహారానికి ఊ అంటారా..ఏమో చూడాలి.