Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీనువైట్లపై గృహహింస కేసు?

శ్రీనువైట్లపై గృహహింస కేసు?

దర్శకుడు శ్రీనువైట్లపై గృహహింస కేసు నమోదు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి ఇవి ఈ రోజు గుప్పమన్నవి కాదు. నాలుగు రోజుల కిందటే గుప్పుమన్నాయి. శ్రీనువైట్ల ఫ్రస్టేషన్ లో తనను కొడుతున్నారని, ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాలుగైదు రోజుల క్రితమే టాలీవుడ్ లో వార్తలు వినవచ్చాయి.

కానీ టాలీవుడ్ సెలబ్రిటీ, పోలీసులు వెల్లడించకుండా ఎందుకు అని మీడియా గమ్మున ఊరుకుంది. కానీ  ఈరోజు ఈ వార్త మొత్తానికి బయటకు వచ్చింది. అయితే శ్రీనువైట్ల భార్య ఇచ్చిన ఫిర్యాదుపై టాలీవుడ్ పెద్దలు కొందరు మద్యవర్తిత్వం జరిపి వెనక్కు తీసుకునేలా చేసినట్లు తెలుస్తోంది.

శ్రీను వైట్లది ప్రేమవివాహం. దీనికి కూడా టాలీవుడ్ పెద్దలు మధ్యవర్తిత్వం వుంది. ఇప్పుడు సర్దుబాటుకు కూడా వారే సారథ్యం వహించినట్లు వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?