సంక్రాంతికి ఎలాగైనా విడుదల చేసి తీరాలని రెండు సినిమాలు పోటా పోటీగా రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి రెండేం ఖర్మ, నాలుగైనా ఓకె అని ఎవరైనా అనొచ్చు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఆ రెండు సినిమాలు నందమూరి బాబాయ్..అబ్బాయ్ లవి కావడం. శ్రీవాసు డైరక్షన్ లో ఈరోస్ సంస్థ నిర్మిస్తున్న డిక్టేటర్ సినిమాను సంక్రాంతి విడుదల టార్గెట్ గా ముస్తాబు చేస్తున్నారు. టీజర్ బయటకు వచ్చింది. సినిమా చాలా వరకు పూర్తయింది.
ఇక సుకుమార్ డైరక్షన్ లో బోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా కూడా చకచకా రెడీ అవుతోంది. కానీ డిక్టేటర్ తో పోల్చుకుంటే కాస్త వర్క్ ఎక్కువే మిగిలి వుంది. పైగా సుకుమార్ డైరక్టర్ కదా..కాస్త చెక్కుడు ఎక్కువ వుంటుంది.
కానీ నిర్మాత బోగవల్లి ప్రసాద్ అంతా స్వయంగా చూసుకుంటూ యూనిట్ ను తరుముతున్నాడట. ఎలాగైనా సంక్రాంతికి రావాలని, హీరో ఎన్టీఆర్ కూడా అదే ఆలోచనలో వున్నాడట. మరి ఇద్దరు హీరోల సినిమాలు ఒకసారి విడుదలవుతాయా? లేక వారం రెండు వారాల గ్యాప్ లో వస్తాయా చూడాలి మరి.