దాసరి లాగే మెగాస్టారూనూ..

ఎవరన్నయినా అభినందించాలంటే ఎవరైనా ఏం చేస్తారు. వాళ్ల ఇంటికి లేదా వాళ్ల దగ్గరకు వెళ్లి అభినందిస్తారు. కానీ టాలీవుడ్  వ్యవహరం అంతా కాస్త ఫ్యూడలిజానికి దగ్గరగా వుంటుంది. దాసరి లాంటి పెద్దాయిన అభినందించాలంటే వీళ్లే…

ఎవరన్నయినా అభినందించాలంటే ఎవరైనా ఏం చేస్తారు. వాళ్ల ఇంటికి లేదా వాళ్ల దగ్గరకు వెళ్లి అభినందిస్తారు. కానీ టాలీవుడ్  వ్యవహరం అంతా కాస్త ఫ్యూడలిజానికి దగ్గరగా వుంటుంది. దాసరి లాంటి పెద్దాయిన అభినందించాలంటే వీళ్లే ఆయన దగ్గరకు వెళ్లాలి. ఆ విషయం ముందుగా మీడియాకు చెప్పాలి. ఫోటోలు దిగాలి. అలాగే పొరపాటున ఆయనను వీళ్లు అభినందించాలన్నా ఆయనింటికే వెళ్లాలి. ఇన్నాళ్లూ ఇదే జరుగుతూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా అదే లక్షణాలు పుణికి పుచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న ఆయనను అభినందించడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయనింటికే వెళ్లారు. ఇప్పుడు మెగాస్టార్ తన తమ్ముడు కొడుకు వరుణ్ తేజ నటించిన కంచె సినిమా యూనిట్ ను అభినందించాలనుకున్నారు. అప్పుడు కూడా యూనిట్ నే ఆయన ఇంటికి వెళ్లింది.

అంతే కానీ, అంతటి మంచి సినిమా అందించిన దర్శకుడి ఇంటికో, ఆఫీసుకో తాను వెళ్లి అభినందించడం, ప్రతిభను గౌరవించినట్లు వుంటుంది కదా అని మెగాస్టారుకు ఎందుకు తట్టలేదో? లేదా దాసరి మాదిరిగానే తాను కూడా ఇలా ఇంట్లో కూర్చుని అభినందన కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నారో?