అఖిల్ సినిమా టక్కున వెనక్కు వెళ్లిపోయింది..కానీ మరి ఎప్పుడు వస్తుంది..అదే ఇప్పుడు టాలీవుడ్ లో కీలక విషయమైపోయింది. దాని డేట్ ను చూసుకుని, తమ సినిమాల డేట్లు వేసుకోవాలని కొన్ని సినిమాలు వేచి వున్నాయి.
వాటిలో బెంగాల్ టైగర్, శంకరాభరణం రెండూ వున్నాయి. వాస్తవానికి బెంగాల్ టైగర్ నవంబర్ 6 అని మళ్లీ 11 కు వెళ్లింది. శంకరాభరణం ఎప్పటి నుంచో 11 అంటోంది. కానీ ఇప్పుడు ఈ 11న అఖిల్ వచ్చికూర్చుంటుందని టాక్. దాంతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఈ రెండు సినిమాలను వాయిదా వేసుకోమంటున్నారట.
అయితే పక్కగా అఖిల్ వస్తుందనుకుంటే వీళ్లకు వాయిదా వేసుకోవడానికి ఇబ్బందేం లేదు. కానీ అదీ నమ్మకంగా చెప్పడం లేదట. దర్శకుడు వినాయక్ ను అడిగితే, 28,29 తేదీల్లో అఖిల్ సినిమా గ్రాఫిక్స్ ఫుటేజ్ వస్తుంది. అది చూసి, బాగుంది క్వాలిటీ అనుకంటే, 11న విడదుల, బాగా రాలేదు అనుకుంటే డిసెంబర్ కు వెళ్లిపోతాం అంటున్నాడని వినికిడి. దాంతో చేసేది ఏమీ లేక, 28,29 తేదీల కోసం చూస్తున్నాయి మిగిలిన సినిమాలు.