మేనేజర్ పై బుస్సుమన్న హీరో?

తన తాజా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంత బాగా రాణించకపోవడంతో, ఓ యంగ్ హీరో తన మేనేజర్ పై కాస్త గట్టిగానే నోరు చేసుకున్నట్లు వినికిడి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, కీలక నిర్ణయాల వెనుక…

తన తాజా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంత బాగా రాణించకపోవడంతో, ఓ యంగ్ హీరో తన మేనేజర్ పై కాస్త గట్టిగానే నోరు చేసుకున్నట్లు వినికిడి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, కీలక నిర్ణయాల వెనుక సదరు మేనేజర్ సిఫార్సులు అధికంగా వుండడం, ఆ నిర్ణయాలే ఇప్పుడు వికటించడం వంటి వాటితో మనస్తాపం చెందిన హీరో ఆ మేనేజర్ ను ఈ విషయాలపై నిలదీసినట్లు తెలిసింది.  

పైగా గతంలో ఆ మేనేజర్ మీద కొన్ని విమర్శలు వచ్చినా, ఎవరు ఎలా చెప్పినా, సదరు హీరో పట్టించుకోలేదట. ఇప్పుడు వాటినీ, వీటినీ కలిపి నిలదీసినట్లు గ్యాసిప్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా వుంటే, తాజా చేయాలన్న ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టాలని హీరో నిర్ణయించగా, ఆ హీరోతో సినిమాచేయాలని చిరకాలంగా ప్రయత్నిస్తున్న సంస్థ ఇప్పుడు సైలంట్ అయినట్లు కూడా తెలుస్తోంది.