తెలుగులోకి శ్రీదేవి కూతురు

శ్రీదేవి కుమర్తె సినిమా ఆరంగ్రేటం మీద చాలా వార్తలు, గ్యాసిప్ లు వినవస్తూనే వున్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, తెలుగులో ఓ యంగ్ టాప్ స్టార్ సరసన ఆమెను నటించేసేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి.…

శ్రీదేవి కుమర్తె సినిమా ఆరంగ్రేటం మీద చాలా వార్తలు, గ్యాసిప్ లు వినవస్తూనే వున్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, తెలుగులో ఓ యంగ్ టాప్ స్టార్ సరసన ఆమెను నటించేసేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఆ యంగ్ టాప్ స్టార్ తో ఓ పెద్ద దర్శకుడు కాంబినేషన్ లో సినిమా సెట్ చేయడానికి ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. 

ముందు డైరక్టర్ సెట్ అయితే, శ్రీదేవి కూతుర్ని సినిమాలోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అగ్రదర్శకుడు, యంగ్ టాప్ స్టార్, శ్రీదేవి కూతురు అంటే కాంబినేషన్ భయంకరమైన క్రేజ్ ను సంతరించుకుంటుందని అనుకుంటున్నారు. ప్రాజెక్ట్ సెట్ అయ్యేవరకు అంతకన్నా వివరాలు బయటకు రాకుండా వుండాలని అనుకుంటున్నారు కనుక..ఇప్పటికి ఇంతే సంగతులు.