విక్రమార్కుడి కళలు కనిపిస్తున్నాయ్‌

రవితేజ తాజా చిత్రం ‘పవర్‌’ సెప్టెంబర్‌ 5న రిలీజ్‌కి రెడీ అవుతోంది. మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించడానికి కావాల్సిన సరంజామా ఈ చిత్రంలో భేషుగ్గా ఉందనే సంగతి ట్రెయిలర్లు చూస్తే బోధ పడుతోంది. ఆడియో కూడా…

రవితేజ తాజా చిత్రం ‘పవర్‌’ సెప్టెంబర్‌ 5న రిలీజ్‌కి రెడీ అవుతోంది. మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించడానికి కావాల్సిన సరంజామా ఈ చిత్రంలో భేషుగ్గా ఉందనే సంగతి ట్రెయిలర్లు చూస్తే బోధ పడుతోంది. ఆడియో కూడా ఫర్వాలేదనిపించుకోవడంతో మాస్‌ మహారాజాకి మరోసారి బలుపు చూపించే సినిమా అవుతుందనే నమ్మకం పెరుగుతోంది. 

ఈ చిత్రంలో రవితేజ రెండు షేడ్స్‌ ఉన్న పోలీస్‌ పాత్ర చేసాడు. ఒకటి తన ట్రేడ్‌ మార్కు అల్లరి క్యారెక్టర్‌ అయితే ఇంకోటి పవర్‌ఫుల్‌గా కనిపించే రఫ్‌ అండ్‌ టఫ్‌ క్యారెక్టర్‌ అన్నమాట. ఇది వింటే విక్రమార్కుడు గుర్తు రావడం లేదూ? దాదాపుగా ఆ పద్ధతిలోనే ఈ చిత్రం కూడా ఉంటుందట. 

రవితేజని రెండు షేడ్స్‌తో పూర్తి వినోదం నిండిన కథనంతో కొత్త దర్శకుడు బాబీ పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నాడట. కాస్త వినోదం ఉంటేనే ఈమధ్య మహా ప్రసాదం అంటూ కళ్లకి అద్దేసుకుంటున్నారు మన జనం. పవర్‌లో కనుక ఆ వినోదం ఓ పిసరంత ఎక్కువే ఉందనుకోండి… పండగ చేసేసుకుంటారు. ఇందులో విషయం ఉందనేది తేలాల్సి ఉందిక.