పవన్‌కళ్యాణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ‘గోపాల గోపాల’ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో పవన్ ఒక ఇరవై నిముషాల పాటు కనిపించే పాత్ర చేస్తున్నాడు. అయితే ఇది మల్టీస్టారర్ సినిమాగానే ప్రచారం పొందుతోంది. పవన్, వెంకీలు ఉండడంతో బయ్యర్లు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు.
ఏ పెద్ద సినిమాకీ తీసిపోని విధంగా గోపాల గోపాలకి బిజినెస్ జరుగుతోంది. అవడానికి పక్కా క్లాస్ సినిమా అయినా కానీ మాస్ ఏరియాల్లో కూడా బిజినెస్ ఆఫర్లు బాగా వస్తున్నాయి. జస్ట్ వెంకటేష్ సినిమాకి అయితే ఇంతటి ఆఫర్లు వచ్చే అవకాశమే లేదు. ఈ సంగతి ఈ చిత్ర నిర్మాతలకి కూడా బాగా తెలుసు. అందుకే పవన్‌కళ్యాణ్ పాత్రని పెంచడం మినహా మరో దారి లేదని గ్రహించారు.
మొదట్లో ఒరిజినల్ కథకి మార్పులు చేయడానికి ససేమీరా అన్న పవన్‌కళ్యాణ్ కూడా ఇప్పుడు నిర్మాతల ఆందోళనని అర్థం చేసుకున్నాడట. తన పాత్రని ముందు అనుకున్న దానికంటే డబుల్ ఉండేలా, దాదాపుగా ద్వితీయార్థం అంతా కనిపించేలా చూసుకుంటామన్నా సరే అన్నాడట. మొదట పవన్‌పై అసలు పాటలే ఉండకూడదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక సోలో సాంగ్, వెంకీ కాంబినేషన్లో మరో సాంగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.