త్రివిక్రమ్ తో సినిమా చేయాలని నితిన్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వినికిడి. త్రివిక్రమ్ చిన్న సినిమా రేస్ లోంచి రామ్ తప్పుకున్నట్లే. ఇప్పుడు ఇద్దరు హీరోలు మాత్రం మిగిలారు. నాగచైతన్య..నిఖిల్. ఈ వారంలో ఒక పేరు ఫైనల్ అయ్యే అవకాశం వుంది. నాగచైతన్యకు అడ్వాంటేజ్ ఏమిటంటే ఆల్రెడీ అదే నిర్మాత రాధాకృష్ణ దగ్గర డేట్లు వున్నాయి. నితిన్ కు ప్లస్ ఏమిటంటే, త్రివిక్రమ్ మొగ్గు అతగాడి వైపే వుండడం.
ఈ విషయంలో నాగచైతన్య చేయాలనీ, చేయకూడదనీ అనుకోవడం లేదు. అడిగితే చేద్దాం..అనే ధోరణిలో వున్నట్లు వినికిడి. కానీ నితిన్ మాత్రం ఎలాగైనా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ కావాలని చూస్తున్నాడు. దానికి తగినట్లు తెరవెనుక యత్నాలు కూడా చేసాడు..చేస్తున్నాడు. త్రివిక్రమ్ సన్నిహితుడు పవన్ చెేత కూడా ఓ మాట చెప్పించాడని టాక్.
త్రివిక్రమ్ లెక్క ప్రకారం ఈ మీడియం రేంజ్ సినిమాను 45 రోజుల్లో ఫినిష్ చేసి, అక్టొబర్ కు విడుదల చేసేయాలన్నది ఆలోచన అని తెలుస్తోంది. ఎక్కవ భాగం ఒక ఇంటి లోపల జరుగుతుందని, అందువల్ల పెద్ద కష్టం కాదని వినికిడి. హీరోయిన్ కు కాస్త అవకాశం వుండే ఈ సినిమాలో హీరో పాత్ర కూడా కీలకమైనదే. దీనికి బడ్జెట్ 20 కోట్లు.
ప్రస్తుతం నాగ చైతన్య కన్నా నితిన్ సినిమాకు ఓపెనింగ్స్, క్రౌడ్ పుల్లింగ్ బాగుంటుందని, అందువల్ల అతన్నే తీసుకోవాలన్నది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి, నాగచైతన్య, అడిగితే చేద్దాం..లేదంటే లేదు, అని డిసైడ్ అయి, తన గౌతమ్ మీనన్, చందుమొండేటి సినిమా షెడ్యూళ్లు యధాప్రకారం వుండేలా చూసుకుంటున్నాడట.ప్రస్తుతం నాగచైతన్య యుఎస్ లో హాలీడే మూడ్ లో వున్నాడు. అక్కడి నుంచి రాగానే ఏ సంగతీ ఫైనల్ అయిపోతుంది.