బాహుబలి 2 తరువాతే ఏదయినా

జనాలు ప్రభాస్ సినిమా చూసి రెండేళ్లు దాటేసింది. ఇప్పుడు బాహుబలి విడుదల దగ్గరవుతోంది. అయితే దాని తరువాత వెంటనే అయినా అభిమానులను అలరించే మాస్ మసాలా సినిమా లేదా ప్రభాస్ స్టయిల్ ఫ్యామిలీ సినిమా…

జనాలు ప్రభాస్ సినిమా చూసి రెండేళ్లు దాటేసింది. ఇప్పుడు బాహుబలి విడుదల దగ్గరవుతోంది. అయితే దాని తరువాత వెంటనే అయినా అభిమానులను అలరించే మాస్ మసాలా సినిమా లేదా ప్రభాస్ స్టయిల్ ఫ్యామిలీ సినిమా ఎప్పుడు చేస్తాడా అని చూస్తున్నారు. రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టిన సుజిత్ దర్శకత్వంలో ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అయితే అసలు సంగతి ఏమిటంటే, బాహుబలి 2 తరువాతే ఆ సినిమా అయినా విడుదలయ్యేదంట. 

బాహుబలి వన్ ఫలితం ఎలా వున్నా, బాహుబలి 2 పూర్తి చేసి, వచ్చే జూన్ నాటికి జనం ముందుకు తెస్తారట. బాహుబలి 2 రాకుండా ప్రభాస్ సినిమా మరేదీ తీసుకురాకూడదని అనుకుంటున్నారట. అలా తీసుకువస్తే, బాహుబలి 2 మీద ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారట. అంటే ఈ లెక్కడ రెగ్యులర్ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూడాలంటే కనీసం మరో ఏడాదిన్నర పైనే ఆగాలన్నమాట.