వరుస వైఫల్యాలతో డీలా పడిన హీరో నాని చాలా కాలంగా రిలీజ్ కాకుండా ఆగిపోయి ఉన్న ‘జెండాపై కపిరాజు’ కాస్త రెపరెపలాడేసరికి ఎక్సయిట్ అయ్యాడు. తాను ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఏదో ఒక మ్యాజిక్ చేసి బాగా ఆడేస్తుందని, తన పరాజయాలకి బ్రేక్ వేస్తుందని ఆశించాడు. అయితే కాస్త సందడి చేసిన తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి కొత్త అప్‌డేట్లు లేవు.
ఆగస్ట్ రెండవ వారంలోనే విడుదలవుతుందని అనుకున్న జెండాపై కపిరాజు ఇంతవరకు పత్తా లేదు. రాబోయే రోజుల్లో అన్ని శుక్రవారాలు ఆక్యుపై అయిపోయాయి కనుక మరో నెలన్నర వరకు స్లాట్ ఖాళీ లేదు. తెగించి ఏదో ఒక పెద్ద సినిమాకి పోటీగా విడుదల చేస్తే తప్ప. లేట్ అయినా కానీ మంచి టైమ్‌లో సినిమాలేమీ లేకుండా రిలీజ్ చేస్తున్నారని అనుకుంటే సడన్‌గా జెండా పీకేసి నానికి షాకిచ్చారు నిర్మాతలు.
నెక్స్‌ట్ ఏమి చేయాలో పాలుపోక ఖాళీగా ఉన్న నాని ఇప్పుడు ఈ జెండా ఎగిరే వరకు ఇంకొన్నాళ్లు ఖాళీగా ఉంటాడా లేక ఇది ఎప్పుడెగిరినా ఓకే అనుకుని వేరే సినిమాల్తో బిజీ అయిపోతాడా?