ఎన్టీఆర్ ను ఇకనైనా వదిలేస్తారా?

మావయ్య చంద్రబాబుతో విబేధాలు వచ్చిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ .  ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అటు కమ్మ సామాజికవర్గానికి కూడా పాపం కాస్త దూరమయ్యారు . ఎవరెన్ని చెప్పినా వాస్తవం ఇది. గడచిన…

మావయ్య చంద్రబాబుతో విబేధాలు వచ్చిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ .  ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అటు కమ్మ సామాజికవర్గానికి కూడా పాపం కాస్త దూరమయ్యారు . ఎవరెన్ని చెప్పినా వాస్తవం ఇది. గడచిన రెండు సినిమాల సమయంలో వాటికి వ్యతిరేకంగా లక్షలాది ఎస్సెమ్మెస్ లు వెళ్లడం వెనుక ఈ వ్యవహారం కూడా వుందని అంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. లోకేష్ తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడు, నెంబర్ టూ అయిపోయారు. ఇప్పుడు ఇక ఎన్టీఆర్ చేయగలిగింది ఏమీ లేదు. అలాగే హరికృష్ణను పూర్తిగా పక్కన పెట్టేసారు. అక్కడ చేయగలిగింది ఏమీ లేదు. 

ఎన్నికల ముందు కాస్త వైకాపా వైపు మొగ్గిన ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం వైపు వచ్చేసారు. ఇలా జూనియర్ కు అన్నివైపులా దారులన్నీ మూసుకుపోయినట్లే. అందుకే ఆయన కూడా మావయ్య అధికారం చేపట్టనపుడు బుద్దిగా వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. దీంతో పరిస్థితి మారిందనే అనుకోవాలా? ఇప్పటికే ప్రారంభమైన రభస పబ్లిసిటీ ఫ్లెక్సీల్లో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో, పెద్ద ఎన్టీఆర్ బొమ్మ కూడా దర్శనమిస్తోంది. పచ్చ రంగు బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఎన్నికలు అయిపోయాయి, లోకేష్ కు యువరాజ్య పట్టాభిషేకం జరిగిపోయినట్లే. 

అందువల్ల ఇక ఈ సారి ఈ వ్యతిరేక ప్రచారం, ఎస్సెమ్మెస్ లు వుండవనే జూనియర్ అభిమానులు భావిస్తున్నారు. అయినా ఇంకా లోకేష్ కు ఏమన్నా లోలోపల కోపం వుంటే మాత్రం పరిస్థితి వేరుగా వుండొచ్చు. 

ఇదిలా వుంటే, ఎన్టీఆర్ అభిమానులు అంతా వారంతట వారు సమాచారం అందించుకుని, ఆ రోజు సినిమా చూసేందుకు తెల్ల చొక్కాలు వేసుకుని వెళ్లాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మళ్లీ తెలుగుదేశాన్ని, లోకేష్ ను కెలికినట్లే. ఎందుకంటే పార్టీ అంటే పచ్చరంగు కదా..ఈ తెల్లరంగేమిటన్న క్వశ్చను వస్తుంది. అయితే పచ్చరంగు అయితే తెలుగుదేశం బలం అన్నట్లు వుంటుంది. అదే తెల్లరంగు అయితే అచ్చంగా ఎన్టీఆర్ బలం అన్నట్లు వుంటుంది. కానీ ఈ సమాచారాన్ని ఎందరు పట్టించుకుంటారో, అసలు నిజమో కాదో రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది.