అలాంటి ప్రేక్షకులు ఇప్పుడెక్కడున్నారు

గతంలో తెల్లారేవరకూ నాటకం వేస్తే ఓపిగ్గా చూసిన ప్రేక్షక మహాశయులు ఇప్పుడు రెండు గంటలు థియేటర్‌లో కూర్చోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వచ్చేశారు.. అని చెబుతుంది సీనియర్‌ హీరోయిన్‌, మాజీ ఎంపీ జయప్రద. తాను…

గతంలో తెల్లారేవరకూ నాటకం వేస్తే ఓపిగ్గా చూసిన ప్రేక్షక మహాశయులు ఇప్పుడు రెండు గంటలు థియేటర్‌లో కూర్చోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వచ్చేశారు.. అని చెబుతుంది సీనియర్‌ హీరోయిన్‌, మాజీ ఎంపీ జయప్రద. తాను సినిమాల్లోకొచ్చేనాటికే ప్రేక్షకులు స్పీడ్‌ అయ్యారనీ, ‘సిరిసిరిమువ్వ’ సినిమా టైమ్‌లో హిందీ సినిమాలు ఫ్యాషన్స్‌ వైపు పరుగులు తీస్తున్నాయనీ చెప్పింది. 

అందుకే ‘ఝుమ్మంది నాదం’ పాటక మహాదేవన్‌గారు తగిన దరువులు వేసి పాట చేశారట. ఆ పాత్రలో డ్రమ్స్‌ వాయించింది డ్రమ్మర్‌ శివమణి. అలా కళాత్మకత, ఆధునికత కలబోసి చేసిన సినిమా అది. ఇక ఎన్టీఆర్‌తో చేసిన అడవిరాముడు, యమగోల చిత్రాల నాటికి ప్రేక్షకులు మంచి టేస్ట్‌తో వున్నారు.

‘యమగోల చిత్రంలో ఎన్టీఆర్‌తో నేను చేసిన చిలక్కొట్టుడు కొడితే చిన్నదానా.. పాట యువతరాన్ని ఊపిపారేసిందప్పుడు. ఆ పాటని థియేటర్స్‌లో కూడా రిపీట్‌గా వేయమని ప్రేక్షకులు గోలగోల చేసేవారు. అలాంటి ప్రేక్షకుల టైమ్‌లో మేం హీరోయిన్స్‌గా పాసయిపోయాం. ఇప్పటి అమ్మాయిలకు చాలా కాంపిటీషన్‌ వుంది. పైగా హీరోయిన్‌గా మనగలిగే సమయం కూడా తక్కువే. స్పీడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్స్‌ నిజంగా అదృష్టవంతులే’ అంటోంది జయప్రద.