గతంలోనూ ఇప్పుడూ ఎప్పటికీ కామెడీకున్నంత ఆదరణ ఇంకోదానికి వుండదు. ఇవ్వాళ కమెడియన్ రోజుకి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే దానికి వున్న ఆదరణ అలాంటిది.
హిందీలో కామెడీకి ఇప్పుడు మోగిపోతున్న పేరు కపిల్ శర్మ. ఈయన టీవీల్లో చేసే ప్రోగ్రామ్‌కు విపరీతమైన ఆదరణ వుంటుంది. సొంతంగా కోట్లాది రూపాయల విలువగల క్యారవాన్ ఈయనకు వుందట. ప్రోగ్రామ్‌కి కోట్లాది రూపాయలు తీసుకునే కపిల్ శర్మకు సినిమాల్లో నటించేంత తీరిక లేదట.
పైగా సినిమాల కోసం చాలా టైమ్ కేటాయించాలనీ, అంత టైమ్‌లో తాను రెండు షోలు చేసేయగలననీ, అందుకే సల్మాన్‌ఖాన్ లాంటివాళ్ళు అడిగినా సినిమాలు చేయలేకపోతున్నాననీ చెప్పే కపిల్ శర్మ తనకు ప్రత్యేకంగా స్క్రిప్ట్ లేకుండానే నవ్వించడం దేవుడిచ్చిన వరం అని చెబుతున్నాడు. చూస్తుంటే సినిమాలను టీవీలు వెక్కిరించే రోజులొచ్చేశాయేమో.