విక్రమ్ సిక్కయ్యాడా?

హీరోలు సినిమాల కోసం మరీ ప్రయోగాలకురెడీ అయిపోతున్నారు. ప్రభాస్, అనుష్క బాహుబలి కోసం బరువు పెరిగి, తరిగి, ఇలా చాలా చేసారు. లడ్డూబాబు కోసం అల్లరి నరేష్ ఇలాగే గంటలు గంటలు ఊపిరి ఆడని…

హీరోలు సినిమాల కోసం మరీ ప్రయోగాలకురెడీ అయిపోతున్నారు. ప్రభాస్, అనుష్క బాహుబలి కోసం బరువు పెరిగి, తరిగి, ఇలా చాలా చేసారు. లడ్డూబాబు కోసం అల్లరి నరేష్ ఇలాగే గంటలు గంటలు ఊపిరి ఆడని కాస్ట్యూమ్స్ లో కూరుకుపోయి, ఇబ్బంది పడ్డాడు. 

ఇప్పుడు విక్రమ్ వంతువచ్చింది. ఐ సినిమా కోసం బోలెడు బరువు పెరిగి, మళ్లీ తగ్గి, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది.  అందువల్లే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వార్తలు అందుతున్నాయి.  ఇటీవ‌ల విక్రమ్ ఫొటో ఒక‌టి సోషల్ నెట్ వర్క్ లో చలామణీ అయింది. 

ఆ ఫొటోలో బాగా డల్ అయిపోయినట్లు కనిపించాడు విక్రమ్‌ బ‌క్కచిక్కి, నీరసంగా క‌నిపిస్తున్న విక్రమ్ ఫొటో చూసి జనం స్టన్ అవుతున్నారు. విక్రమ్ తన అభిమానులకు తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇవ్వడం అవసరం.