బాహుబలి మూడో పార్ట్ లేదని, రెండుతో బాహుబలి ముగుస్తుందని రాజమౌళి స్పష్టం చేసాడు. అయితే అది కాస్త అటు ఇటుగా చెప్పాడు. ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం బాహుబలి ది కంక్లూజన్ అన్నందుకు అలాగే ఆపేసి, మహేంద్ర బాహుబలి తన తండ్రికి సంబంధించిన శతృ శేషం చేసేసిన తరువాత ఏమయింది?
అంటే ఒక విధంగా అమరేంద్ర బాహుబలి ఫ్లాష్ బ్యాక్, ఆపై మహేంద్ర బాహుబలి ప్రతీకారం చేసేయడంతో బాహుబలి వ్యవహారం ముగుస్తుంది. కానీ మధుబాబు షాడో సీరీస్ లా, లార్డ్ ఆఫ్ ది రింగ్స్..ది హాబిట్ మాదిరిగా..ఇందులోని పాత్రల కొత్త వ్యవహారాలతో మూడో సినిమా వుంటుదట. మూడోపార్ట్ వుందని వెల్లడిస్తే, రెండో పార్ట్ పై ఆసక్తి తగ్గుతుందని, అలాగే పార్ట్ అని చెబితే, రెండో పార్ట్ చివర కూడా ట్విస్ట్ పెట్టాల్సి వుంటుందని, మూడో పార్ట్ లేదని అర్జెంట్ గా ప్రకటించారట.
పైగా సెపరేట్ ఎపిసోడ్ గా చేయడం వల్ల ఇంకో సౌలభ్యం వుందని రాజమౌళి భావిస్తున్నాడట. అప్పుడు తొలి రెండు భాగాల్లో వున్న అన్ని పాత్రలను క్యారీ చేయాల్సిన అవసరం వుండదట.కానీ బాహుబలి సీరిస్ మాత్రం ఇప్పటిదో ఆగదన్నది వాస్తవం.ఇక శ్రియ, రెహమాన్ అంటూ వినిపిస్తున్నవి అన్నీ మాత్రం కచ్చితమైన రూమర్లు తప్ప వేరు కాదట.