కృష్ణ ఇంట కెసిఆర్ టాలీవుడ్ మీట్

ఇప్పుడు టాలీవుడ్ లో తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత చేరువైన హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణే. అందుకే నవంబర్ ఫస్ట్ వీక్ లో కృష్ణ ఆద్వర్యంలో ఓ మీట్ జరగబోతోందని వినికిడి. అది…

ఇప్పుడు టాలీవుడ్ లో తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత చేరువైన హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణే. అందుకే నవంబర్ ఫస్ట్ వీక్ లో కృష్ణ ఆద్వర్యంలో ఓ మీట్ జరగబోతోందని వినికిడి. అది టాలీవుడ్ కు, ముఖ్యమంత్రి కేసిఆర్ కు మధ్య జరిగే సృహుద్భావ సమావేశం అన్నమాట. 

టాలీవుడ్ సమస్యలు, టికెట్ రేట్లు, సబ్సిటీలు, పర్మిషన్లు, ఇలాంటి వాటిపై కెసిఆర్ చేత వరాలు పొందేందుకు వీలుగా ఈ సమావేశం నిర్వహిస్తారని వినికిడి. మంత్రి తలసాని కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దాదాపు టాలీవుడ్ ప్రముఖులు అందరూ ఈ మీట్ కు హాజరయ్యేలా చూస్తున్నారని వినికిడి. మీట్ ఎజెండా, డేట్, ఇంకా ఇతరత్రా వ్యవహారాలు ఫైనల్ కావాల్సి వుంది.