ఆంధ్ర లోని ఓ జిల్లాకు బాహుబలి హక్కులు నాలుగు కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో 50 లక్షలు రిటర్న్ గ్యారంటీ అన్నమాట. అంటే మూడున్నర కోట్ల షేర్ రావాల్సి వుంది ఆ జిల్లాలో. ఇలా రావాలంటే అత్తారింటికి దారేది, మగధీర ను మించిన హిట్ కావాల్సి వుంటుంది.
పైగా ఇలా కొన్న పెద్దాయినే బాహుబలికి ఓ పది కోట్లు ఫైనాన్స్ కూడా చేసారని వినికిడి. దాంతో ఆయనకు సినిమా చూపించారని, చూసిన తరువాత, జనం అంచనాలను అందుకుంటుందా అని అనుమాన పడుతున్నారని తెలుస్తోంది.
ఏ గ్రాఫిక్స్ అద్భుతం అంటున్నారో, అవి, ఇప్పటికి సినిమాకు వచ్చిన హైప్ మేరకు లేవని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్, వార్ సీన్ లు మాత్రం బాగున్నాయని, ముఖ్యంగా సెకండాఫ్ అంత అద్భుతంగా లేదని టాక్ బయటకు వినిపిస్తోంది.
మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి. ఇదిలా వుంటే బాహుబలికి ఓ ప్రాంత హక్కులు తీసుకున్న సంస్థ, ఇప్పుడు రేటు తగ్గించాలని బేరాలు ఆడుతున్నట్లు వినికిడి.