నితిన్ చేతిలో ప్రస్తుతానికి ఓకె చేసిన సినిమా ఒకటే వుంది. మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడి సినిమా అది. కానీ ఇప్పుడు నితిన్ చూపు మరో వైపు పడింది. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు. త్రివిక్రమ్ కనుక ఊ అంటే, వెంటనే కాల్ షీట్లు ఇవ్వాడానికి, అవసరమైతే తక్కువ రెమ్యూనిరేషన్ కు చేయడానికి కూడా తాను సిద్దం అని సిగ్నల్స్ పంపాడట.
Advertisement
అయితే ఇంకా అట్నుంచి రెస్పాన్స్ ఎలా వుంది అన్నది తెలియరాలేదు. ఈ లోగా ఈ పరిణామంతో, నితిన్ తో సినిమా చేద్దామని ఆశగా వున్న మల్లిడి వేణు కంగారు పడుతున్నట్లు బోగట్టా. ఎందుకంటే, నితిన్-త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయితే ఈయన సినిమా వెనకబడుతుంది కదా..అదీ కథ.