స్వామినాయుడు..సెలబ్రిటీ కాకున్నా, చిరంజీవి అభిమానులకు సుపరిచితమే. ఆయన అభిమాన సంఘాల నాయకుడిగా. ఇప్పుడు ఆయనే నేరుగా చిరంజీవి 150వ సినిమా పేరు ఆటో జానీ కాదు, అని ప్రకటించారు. కానీ మరోపక్క దర్శకుడు పూరి జగన్నాధ్ గతంలోనే ఆటో జానీ అన్న పేరు తన బ్రెయిన్ చైల్డ్ అని ప్రకటించారు. అసలు ఆ టైటిల్ కే మెగాస్టార్, ఆయన కొడుకు మెగాపవర్ స్టార్ పడిపోయారని టాక్. మరి ఇలాంటి నేపథ్యంలో స్వామినాయుడు ఇలా ప్రకటించడం అంటే ఏమనుకోవాలి? ఆటోజానీ సినిమా ఇప్పుడు లేదనుకోవాలి.
ఇదిలా వుంటే వివి వినాయక్ తో కథా చర్చలు జరపడంపై దర్శకుడు పూరి జగన్నాథ్ క్లారిటీ కోరినట్లు వినికిడి. దానికి మెగాస్టార్, ఆ చర్చలు 151 వ సినిమా కోసం అని బదులిచ్చారని టాక్. అంటే పూరి సినిమా 150వది అలాగే వుంటుందనేగా. మరి స్టార్ మాట కరెక్ట్ నా..స్టార్ అభిమాని మాట కరెక్టా అన్నది చూడాలి. అసలు ఇద్దరు స్టార్ డైకర్టర్లను కథలు రెడీ చేయమన్నారని, ఆగస్టు 22 నాటకి ఎవరిది రెడీ అయితే వారిదే పట్టాలు ఎక్కువతుందని మరో మాట.
ఈవైనం అంతా ఇలా వుండగా, మెగాస్టార్ క్యాంప్ లో జరిగే సంగతులు అన్నీ బయటకు ఎలా వస్తున్నాయి అన్నదానిపై కూడా క్యాంప్ జనాలు కాస్త కలవరపడినట్లు వినికిడి. పూరికి అవకాశం ఇచ్చే విషయంలో చరణ్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు ఇచ్చారంటూ వదంతులు వినరావడం, దానిపై గ్రేట్ ఆంధ్రలో వార్త రావడం తెలిసిందే. ఇదెలా బయటకు వచ్చిందని కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద ప్రారంభం అవుతుందో కాదో కానీ, 150 వ సినిమా చాలా కబుర్లకు దారితీస్తోంది.