ఎన్టీఆర్ కోసం ఇద్దరు రెడీ

ఎన్టీఆర్ తో సుకుమార్ సినిమా ఇదిగో అదిగో అంటోంది..తాజగా డేట్ జూలై 9. మరి అది మొదలు కావాలి..మూడు నుంచి నాలుగు నెలల తరువాత కానీ ఎన్టీఆర్ ఖాళీ కాడు. ఆ సమయం కోసం…

ఎన్టీఆర్ తో సుకుమార్ సినిమా ఇదిగో అదిగో అంటోంది..తాజగా డేట్ జూలై 9. మరి అది మొదలు కావాలి..మూడు నుంచి నాలుగు నెలల తరువాత కానీ ఎన్టీఆర్ ఖాళీ కాడు. ఆ సమయం కోసం ఇద్దరు దర్శకులు రెడీగా వేచి వున్నారు. సత్యమూర్తి చేసిన త్రివిక్రమ్, శ్రీమంతుడు ఫినిష్ చేసిన కొరటాల శివ, ఇద్దరూ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. 

కొరటాల శివ దగ్గర గతంలో చరణ్ కోసం రెడీ చేసిన సబ్జెక్ట్ సిద్దంగా వుందట. నిజానికి ఇవి ఎన్టీఆర్ కెరీర్ కు మంచి ఆఫర్లే. ఇద్దరూ స్టామినా వున్న డైరక్టర్లే. మరి సుకుమార్ ను కాస్త కదిలించి, అదిలించి, ఆ సినిమా త్వరగా ఫినిష్ చేసుకుంటే బాగుండును. కానీ అదే జరిగేలా కనిపించడం లేదు.