ఫుల్ గడ్డంతో ఈటీవీ 20 యేళ్ల వేడుకలో పవన్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి గడ్డంతో దర్శనమిచ్చాడు. ఈటీవీ 20 వసంతాల వేడుకలో ఆయన పాల్గొన్నాడు. అతి తక్కుమంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకలో పవన్ లుక్స్ బయటకు వచ్చాయి. ఇంకా…

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి గడ్డంతో దర్శనమిచ్చాడు. ఈటీవీ 20 వసంతాల వేడుకలో ఆయన పాల్గొన్నాడు. అతి తక్కుమంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుకలో పవన్ లుక్స్ బయటకు వచ్చాయి. ఇంకా టీవీలో ఈ వేడుక ప్రసారం కాలేదు. త్వరలో ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్ గుట్టును బయటకు వివరించాడు సీనియర్ యాక్టర్ నరేష్. ఆయన తన ట్విటర్ అకౌంట్లో ఈ కార్యక్రమ వివరాలను పోస్టు చేశాడు. 

20 సంవత్సరాల వేడుకలో ఎస్పీబీ, దాసరి, మనో వంటి వాళ్లంతా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు తనను అభినందించిన విషయం అమితానందాన్ని కలిగిస్తోందని నరేష్ ట్వీట్ చేశాడు.

ఈ వారాంతంలో ఈ జరిగిన ఈ ప్రోగ్రామ్ పవన్ లుక్సే చాలా చిత్రంగా ఉన్నాయి. దట్టంగా.. పొడవుగా పెంచేసిన గడ్డం, జుట్టుతో పవన్ గుర్తుపట్టలేనంతగా.. ఒక బాబా లా మారిపోయాడు. మరి సింహానికి.. పవన్ కు ఇప్పుడు తేడా ఏమీ లేదేమో!